తన చదువు పూర్తయిన తర్వాత శిల్పకళలో ఎవరు గొప్పవారో వారి వద్దకు వెళ్లి తనకు విద్య నేర్పమని వినయంగా అడిగితే రెడ్డి గారి పేరు చెప్పగానే ఇది శూద్రులకు వంట బట్టే విద్య కాదు బ్రాహ్మణుడు తప్ప మరొకరు దీనికి పనికి రారు అని నిర్మొహమాటంగా చెప్పారు. ఆ తర్వాత తనకు తెలిసిన అనేక మంది ద్వారా ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆలోచనలో పడి వారు చెబితేనే విద్య వస్తుందా శిల్పాలను చూసి మనం నేర్చుకోవాలి అనే నిర్ణయం తీసుకొని స్వయం కృషి తో ప్రారంభించారు. నీవు రేడియోకు పనికిరావు అన్నప్పుడు నేను ఎంత కృషి చేసి ఎవరు నన్ను తిరస్కరించారో వారికి చెప్పే స్థితికి వచ్చానో మీ వల్ల కాదు సుత్తి పట్టుకోవడం కూడా తెలియదు నీవు శిల్పాలను చెక్కడం ఏమిటి అని ఏద్దేవా చేసిన వారంతా... నిన్ను మించిన వారు మరొకరు లేరు ప్రస్తుత కాలంలో అని బందా గారు నన్ను అక్కున్న చేర్చుకున్నట్లుగానే రెడ్డిగారిని తిరస్కరించిన స్థపతులు అందరూ ఏకకంఠంతో పలికిన మాటలు మా సరసన నిలబడడానికి నీవు అర్హుడవే అని. అందుకోసం వారి గురించి చెప్పాను తప్ప మత అభిమానము కుల అభిమానము కాదని వినయపూర్వకంగా మనవి చేస్తున్నాను. కార్యసాధకుడు ఎవరు వెను తిరిగి వెళ్ళడు. ఏది చేయాలనుకున్నాడో దానిని సాధించి తీరతాడు భారతంలో నపుంసకత్వ పాత్రధారి అర్జునుడితో చెప్పిస్తాడు వ్యాసుడు నిల్చి గెల్చిన సత్కీర్తి నెగడు గాక దవ్వుదవ్వుల నిట్లయిన నవ్వరెట్లు అన్నది శివనాగిరెడ్డి జీవితానికి సరిగా సమన్వయ పడుతుంది. ఎవరి అవహేళనకు గురై తాను అనుకున్న విద్యను సాధించాలని అనుకున్నాడో దానిని సాధించి చూపిన సాహసి. సామాన్యంగా ఏ కళాకారుడైనా తాను చేసిన పని తనకు నచ్చదు ఇంకా బాగా చేయాలి అనిపిస్తోంది. జక్కన్న గారు ఉన్నారు దేశంలోనే మహా శిల్పిగా పేరుగాంచాడు. వారిని మించిన వారు మరొకరు లేరు అనుకున్నారు ప్రజలు. కానీ తన శిల్ప సంపద తనకు నచ్చలేదు మధ్యలోనే వదిలేశారు ప్రపంచ చిత్రకారులలో అగ్రగణ్యుడైన రవివర్మ భగవంతుడు అంటే ఇలాగే ఉంటాడు అన్నట్లుగా చిత్రాలను గీసి మనకందించిన వాడు మానసిక విశ్లేషణతో ఆయన చెప్పే విషయం ఏమిటంటే తాను ఏ బొమ్మను గీయాలనుకుంటున్నాడో దానిని ముందు తన మనో ఫలకం మీద ముద్రించుకుంటాడు. ఎంతో తేజోవంతంగా మనోహరంగా కనిపిస్తోంది మనసులో. దానిని కాగితాల మీదకు తీసుకు వచ్చే సరికి 80 శాతం మాత్రమే తయారవుతుంది. తాను అనుకుని కూడా తాను చేయలేని అసమర్థత. ప్రపంచంలో ఎవరైనా ఇంతే అంటాడాయన.
గొప్ప స్థపతి మా శివనాగి రెడ్డి (6);-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి