"రాఖీపౌర్ణమిపండుగ-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్-తెలుగుఉపన్యాసకులు-సిద్ధిపేట-చరవాణి :- 6300474467
 01.
తే.గీ.
అక్కతమ్ములబంధమునల్లుకొనుచు
అన్నచెల్లెలిబంధముమిన్నయగుచు
సాగిపోగనుదీవించుసక్రమముగ
భువినిరాఖీలపండుగబోధజేసె!!!

02.
తే.గీ.
రక్షగాయుండిప్రతిరోజునేక్షణమున
ఆడబిడ్డలకెప్పుడుతోడువౌచు
వారికానందమిడుటయేభావ్యమనుచు
భువినిరాఖీలపండుగబోధజేసె!!!

03.
తే.గీ.
మమతసమతానురాగాలుమరువకనుచు
తోడబుట్టినవారికినీడవౌచు
కంటిరెప్పలానిత్యముగావుమనుచు
భువినిరాఖీలపండుగబోధజేసె!!!





కామెంట్‌లు