ప్రపంచ మానవత్వదినోత్సవం-పద్యాంజలి!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--చరవాణి :- 6300474467
 01.
తే.గీ.
మానవత్వమునిజమైనమనిషికాభ
రణమయిచెలంగిసతతంబురక్షయౌను
నిదియులేనినాడునతడుహీనుడౌను
తెలిసిమసలుకోవలెగాదెతెలివితోడ!!!

02.
తే.గీ.
మానవతకునుసాక్ష్యముమదరుథెరిస
విశ్వమందునపంచెనుప్రేమసుధలు
కరుణగుణశీలికారుణ్య  నిరుపమాన
సేవలొనరించెముదమారశ్రేష్ఠురాలు!!!

03.
తే.గీ.
ఈకరోనలోమనుజులునీప్సితముగ
మానవత్వముచాటించిమసలుకొనిరి
బంధములకునువిలువలపథముజూపి
మంచితనమునుపెంచిరిమహినిపైన!!!



కామెంట్‌లు