"వినాయకస్తుతి-సీసపద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగుఉపన్యాసకులు--సిద్ధిపేట-చరవాణి :- 6300474467
 01.

సీ.
ముందుపూజలునీకుముదమారగనుజేసి
విఘ్నేశనిన్నునేవేడుకొందు
నీస్తుతిమరువకనీనామగానము
నిరతమ్ముగావింతునిశ్చలముగ
విఘ్నాలుతొలగించు,విజయాలనందించు
విలువగుబ్రతుకునుకలుగజేయు
నీతొండమునుచేతనీతిదప్పినవారి
నేలగూల్చగవచ్చిలీలజూపు
(ఆ.వె.)
మూషికమునునెక్కిముజ్జగాలనునేలు
పత్రిపూలుబెడుదుపరవశముగ
శ్రీలనొసగుమయ్యచిద్విలాసప్రియ
అంబపుత్రసుముఖుడాదిదేవ!!!!

02.

సీ.
కాణిపాకమునందుకామ్యార్థములదీర్చ
వరసిధ్ధిగణపతివరలుచుండె
రేజింతలందునపూజలగైకొని
సిద్ధివినాయకుడొద్దికగను
ఖైరతాబాదులోకనిపించునెత్తులో
ప్రతివత్సరంబునభక్తులకును
దేశవిదేశాలదేదీప్యమానమై
కొలువొందితీర్చునుకోర్కెలెన్నొ
(తే.గీ.)
కుడుములుండ్రాళ్లపాయసంకుదురుగాను
కుక్షినిండుగభుజియించిరక్షజేసి
అష్టగణపతియధిపతియిష్టముగను
మాదుబాధలుతొలగించిమోదమొసగు!!!

03.

సీ.
పెద్దచెవులవాడముద్దుగొల్పెడివాడ
ఏకసంథాగ్రాహిఏకదంత
వక్రతొండమువాడవైభవమ్ములతోడ
ఊరేగిభక్తులదారిజూపు
పార్వతితనయుడాపాహిమాంరక్షమాం
బొజ్జదేవరమాకుబుద్ధినేర్పు
సిందూరవదనుడాశ్రీకరశుభకర
చింతలన్నియుబాపుశ్రీగణేశ
(తే.గీ.)
దశబలుడదశార్హుండుడాధర్మరాజ
మూషికరథుడుషడబిజ్ఞపుష్టికాంత
ప్రథమపూజలనందెడిపర్శుపాణి
విద్యపరమార్థమందించువిఘ్నరాజ!!!కామెంట్‌లు