"శ్రీకృష్ణజన్మాష్టమిపండుగ-అష్టకందపద్యాంజలి"!!!"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--చరవాణి :- 6300474467
 01.
కం.
"రారా!యదువంశతిలక"!
"భారమునీవేయనుచునుప్రార్థనజేతున్"
"దూరముజేసియుపాపము"
"దారినిజూపించునాకుదయగలకృష్ణా"!!!

02.
కం.
"భగవద్గీతాసారము"
"జగతికియందించినట్టిశౌరిమురహరీ"
"నిగమములన్నియునేర్చియు"
"తగుధర్మమునిల్పినట్టిదక్షుడుకృష్ణా"!!!

03.
కం.
గోవర్ధనగిరినెత్తియు
గోవులరక్షించినట్టిగోపాలుండా
దీవెనలందించుము,నీ
సేవలుజేతునుమరువకశీఘ్రమెకృష్ణా!!!

04.
కం.
"రారా!రాధామాధవ"!
"రారా!శిఖపింఛమౌళి! రావేమయ్యా"!
"రారా!సరసిజనాభా"!
"రారా!మురళీధరుండ!రారా!కృష్ణా"!!!

05.
కం.
"జోజోగోకులకృష్ణా"
"జోజోనవనీతచోరజోజోకృష్ణా"
"జోజోనందకుమారా"
"జోజోగోపాలలోలజోజోనీకున్"!!!

06.
కం.
అష్టమితిథిలోపుట్టిన
యష్టమసంతానమీవుహరిగోపాలా
కష్టములెల్లనుబాపగ
నిష్టముతోగావుమయ్యయింద్రావరజా!!!

07.
కం.
నవనీతచోరకేశవ
భువనాధీశయఘునాశమోహనబాలా
స్తవనీయసుందరచరిత
ప్రవిమలరేపల్లెవాసప్రణతులుకృష్ణా!!!

08.
కం.
"దండముకృష్ణానీకును"!
"దండముజేతునుసతతముదయజూపవదే"!
"దండముపరమాత్మవిభుడ"
"దండముసద్బోధజేసెధార్మికతేజా"!!!


కామెంట్‌లు