జాడను విడిచి;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ప్రశాంతమైన పల్లె వాతావరణం జాడను విడిచి...
అద్దాల మేడల్లో, రంగురంగుల నీడల్లో బ్రతుకును తలచి...
కలల నగరాన్ని కలవగానే
సంప్రదాయాలను పక్కన పెట్టి...
సినిమా హాళ్ళంటూ, షాపింగ్ మాళ్ళంటూ
విచ్చలవిడిగా చెక్కర్లు కొట్టి...
ఇంట్లో వండిన, అన్నం కూరలను సైడ్ చేసి...
KFC చికెన్ బకెట్ బకెట్లను కడుపులో తోసి...
ఎండమావుల లాంటి ఫాంటసీ వరల్డ్ కు నిచ్చెన వేసి...
రోడ్డు పై కనిపించిన ప్రతి ఫుడ్ ఐటమ్ ల అంతుచూసి...
స్వీట్లు, హాట్లతో స్నేహం చేసుకుంటూ...
పానీపూరి బండిని పదే పదే తలచుకుంటూ...
బ్రేకులు లేని బ్రతుకు బండిని కాస్తా బ్రహ్మానంగా నడిపిస్తూ ఉంటే....
మధ్యలో వచ్చిన మధుమేహం కాఫీలను, టీ లను దూరం చేసే...
బీపీ వచ్చి బాడీకి సాల్ట్ ను కాస్తా భారం చేసే...
BMI పెరగగా వచ్చిన ఒబేసిటీకేమో ఒళ్ళు బాగా వాచే...
వాకింగ్ అంటూ ఓవర్ యాక్షన్ చేస్తే బాడీ పెయిన్స్ ఏమో దూలతీర్చే...
ఇకేం చేయగలం చెప్పండి,
ఈ దేహం మీద చల్లే వరకు గుప్పెడు మట్టి...
తిరగక తప్పదు హాస్పిటల్ చుట్టు 
పట్టుకొని మూరెడు పొడవున్న ముందుల 
ఓ పి చీటీ....


కామెంట్‌లు