నడి రేయిన నిద్ర పోక సద్దు చేస్తున్న
కనురెప్పల చప్పుళ్ళు ఆగేదెప్పుడో....
నా కనులకు కలలను మరిపించిన,
ఆ రూపాన్నితనివితీరా చూసేదెప్పుడో....
నా ఊసుల, ఊహల కాగితాలన్నీ
ఉత్తరాలై అతడిని చేరేదెప్పుడో....
అందక ఉడికిస్తున్న ఆ చందమామ
చిరునవ్వుతో నా చెంతకు చేరి
చెలిమిని కోరేదెప్పుడో....
వీడనంటూ వేధిస్తున్న
నా ఏకాంతం నన్ను
విడిచిపెట్టి పోయేదెప్పుడో....
మదిలోని అలజడులన్నీ
మంత్రాలుగా మారి
మండపాన మోగేదెప్పుడో....
నా తలపులకు సాక్ష్యాలైన
మంచు లాంటి అక్షరాలన్నీ
తలపై మంగళమైన
తలంబ్రాలుగా మారేదెప్పుడో....
ఇరువురి అడుగులు
ఒక్కటై ఏడడుగులుగా సాగేదెప్పుడో....
చెరగని బాసలన్నీ బంధాలుగా
బలపడి ముచ్చటగా
మూడుముళై మెడలో ఒదిగేదెప్పుడో....
కనురెప్పల చప్పుళ్ళు ఆగేదెప్పుడో....
నా కనులకు కలలను మరిపించిన,
ఆ రూపాన్నితనివితీరా చూసేదెప్పుడో....
నా ఊసుల, ఊహల కాగితాలన్నీ
ఉత్తరాలై అతడిని చేరేదెప్పుడో....
అందక ఉడికిస్తున్న ఆ చందమామ
చిరునవ్వుతో నా చెంతకు చేరి
చెలిమిని కోరేదెప్పుడో....
వీడనంటూ వేధిస్తున్న
నా ఏకాంతం నన్ను
విడిచిపెట్టి పోయేదెప్పుడో....
మదిలోని అలజడులన్నీ
మంత్రాలుగా మారి
మండపాన మోగేదెప్పుడో....
నా తలపులకు సాక్ష్యాలైన
మంచు లాంటి అక్షరాలన్నీ
తలపై మంగళమైన
తలంబ్రాలుగా మారేదెప్పుడో....
ఇరువురి అడుగులు
ఒక్కటై ఏడడుగులుగా సాగేదెప్పుడో....
చెరగని బాసలన్నీ బంధాలుగా
బలపడి ముచ్చటగా
మూడుముళై మెడలో ఒదిగేదెప్పుడో....
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి