నాన్న;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
ఆడించి పాడించి....
నువ్వు నిదరోని వేళా నిన్ను లాలించి,
పస్తులు తానుండి నీకు తినిపించి, 
అవసరం వున్న ప్రతిసారీ ఆసరాను అందించి,

ప్రాణం కన్నా ఎక్కువగా 
నిన్ను ప్రేమించి,
అన్ని వేళలా నిన్ను సేవించి,
మంచి చెడుల మధ్య మర్మాన్ని నీకు నేర్పించి,
కాయకష్టం చేసి నిన్ను చదివించి,
వేలు పట్టి నిన్ను నడిపించి, 
వెన్ను తట్టి నిన్ను ప్రోత్సాహించిన నాన్నను......
ఏదో ఇప్పుడు నీకు డబ్బు రుచి సోకగానే, 
ఛీ ఛీ అంటూ దూరం చేసి...
అసలు నువ్వు నాకు ఏమి ఇచ్చావు అంటూ హేళన చేసి....
గూడు కట్టిన గుండెలకు గాయం చేసి...
నీ అవసరం నాకు లేదంటూ వెలివేసి...
ఊహాలోకానికి స్వేచ్ఛగా నువ్వు పరుగులు తీసి...
ఏదో సాధించనట్టు... 
తెగ సంబర పడుతున్నావా?
అడుగులు వచ్చేశాయి కదా ఆగి ఒకే చోట వుండి పోతే 
ఫలితం వుండదు... 
ప్రయత్నం చెయ్యాలి....
ఆ ప్రయత్నం చేయాలంటే ధైర్యం కావాలి...
ఆ ధైర్యమే నాన్న
ఆ ధైర్యాన్నే నువ్వు దూరం చేసుకున్నప్పుడు 
నువ్వు వెతికే మజిలీ కూడా నీకు ఎప్పటికీ చేరువ కాదు...!



కామెంట్‌లు