సరదాలకు అడ్డు చెప్పకండి;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 పిల్లలను చాలా అమాయకులని అనుకుంటాం కానీ వారు తెలివైన వాళ్ళు వాళ్ల తెలివితేటలతో పోలిస్తే మన తెలివితేటలు ఎంత?
కొంతమంది పిల్లలను చూడండి. జ్వరం వచ్చిందని హాస్పిటల్ కి తీసుకొని వెళ్లేంతవరకు బాగానే ఉంటారు. డాక్టర్ రూమ్ లోకి వెళ్ళగానే గట్టిగా కేకలు పెట్టి ఏడుస్తారు. ఎందుకు, ఆ డాక్టర్  సూది వేస్తాడని. అంతేనా ఏదైనా తప్పు చేసి అమ్మ కొట్టడానికి వస్తే, పరిగెత్తుతూ వెళ్లి నాన్న వెనుక దాక్కుంటారు. నాన్న అమ్మను సముదాయించి పంపించాక మెల్లగా బయటకి వస్తారు.
పసితనం కనుక వారికి ఆలోచనలు ఏమీ ఉండవు అందుకే ఏది చెప్పినా త్వరగా నేర్చుకోగలరు, అంతే కాదు మీరు ఎప్పుడైనా గమనించారా మనం ఏది చేస్తే అది వాళ్ళు అనుసరించే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. మనం జో కొట్టి పడుకోబెడితే వాళ్ళు మనకి తిరిగి జోజో కొడతారు. మనం అన్నం పెడితే తిరిగి అన్నాన్ని చిట్టి  చేతులతో పట్టుకొని అమ్మకో, నాన్నకో తినిపిస్తారు. ఎంత ముద్దుగా ప్రవర్తిస్తారో ఈ చిన్నారులు. వారి నవ్వులతో తెలియకుండానే సమయం ఇట్టే గడిచిపోతుంది. ఒక పెన్ను పేపర్ అందించి చూస్తే వారిలో ఉన్న సృజనాత్మకత బయట పడుతుంది. వారి మనసులో ఏముందో, వారి భావుకత ఏమిటో ఇట్టే తెలిసిపోతుంది. పిల్లల సరదాలకు ఎప్పుడు అడ్డు చెప్పకండి అప్పుడే వారు తమ  తమ ప్రయత్నాలను ప్రారంభించి స్వీయ అనుభవాలను సంపాదించగలుగుతారు.


కామెంట్‌లు