మధురోక్తులు;- జక్కల శివ ఇంటర్మీడియట్ - నల్లగొండ 7093225602
 ఎవరిని  విమర్శించకు
 ప్రతి దాన్ని సందేహించకు
 సహనాన్ని కోల్పోకు
 ధైర్యాన్ని విడనాడకు

 ఆవేదనకి లోను కాకు
 కోపాన్ని దరిచేరనీయకు
 మితిమీరి మాట్లాడకు 
 విపరీతంగా ప్రేమించకు

 జీవితంపై ఆశ కోల్పోకు
 అతిగా ఆశించకు
 అసంతృప్తిగా ఉండకు 
 అసూయ చూపకు 

 హింసను రెచ్చగొట్టకు
 సఖ్యత వదులుకోకు
 దురాశ దరిచేరనీయకు
 దుఃఖానికి లోను కాకు

 అబద్దాలు మాట్లాడకు
 నిజాన్ని కప్పిపుచ్చుకు
 జంతువుల ప్రవర్తించకు
 నీచుల స్నేహం చేయకు

 గురువు మాట తప్పకు
 అవిటి వాళ్ళ వెక్కిరించకు
 ఎవర్ని హేళన చేయకు
 చెడును ప్రేమించకు 

 అధికారాన్ని శాసించాలని చూడకు
 పొగడ్తల కోసం పాకులాడకు
 నీతికి పాత రావేయకు
 ఏనాడు ఆడి తప్పక   

 ఊసరవెల్లిలా రూపాలు మార్చుకు
 చెడు మాట్లాడకు
 చెడు చూడకు
 చెడు వినకు 

*********


కామెంట్‌లు