పద్యాలు ; - శివ ఇంటర్మీడియట్7093225602
 ఆట వెలది
 సాటి వానిపైన చాడీలు చెప్పకు
 మభ్యపెట్టటయును మానుకొనుము
 హీన గుణము వాన్కి హిత బోధ చేయకు
 విశ్వ సుజన  వాణి వినుడి చెబుత

 తేటగీతి
 వాదు  లాడకుమెవరితో వలదు వాదు
 ఆడి తప్పక మేవేళ అరయ రెవరు
 చిలక పలుకులు నమ్మకు చేటు కూర్చు
 నాది వాక్కుల వినరండి శ్రద్ధగాను

ఆట వెలది
 అగ్రకులాల వారు అట్టడుగు కులాల
 వారినణిచి వేయు చుండ్రు భువిన 
 బాపలేమ మనము వర్ణ వివక్షతన్
 విశ్వ సుజన వాణి వినుడి చెబుత

తేటగీతి
మృదువుగా మాటలాడుము  ముదముగాను 
 కఠినమైనట్టి మాటలు కాల్చునరుని
మనసు గాయపడ్డమరల మానలేదు 
 నాదు వాక్కుల వినరండి శ్రద్ధతోని 

*********


కామెంట్‌లు