ఆటవెలది
అన్య భాష నేర్వ అవసరంబే గాని
మరవరాదు మనము మాతృభాష
అమ్మ భాష కంటె అధికమైనది లేదు
తరగ చేయవలదు తల్లి భాష
ఆటవెలది :
తేనె కంటెకడు తీయనయిన భాష
మధురమైన భాష మాతృభాష
మరవరాదు మనము మాతృభాషనెపుడు
తరగ చేయ వలదు తల్లి భష
ఆటవెలది
తల్లి భాష యేను తరగని సంపద/
అమ్మ భాషలోనె అందముంది//
అమ్మ
భాషయేను అపురూపమైనది
తీయ నైనభాష తెలుగు భాష
*********
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి