సాహితీ బృందావన విహార వేదిక ఆధ్వర్యంలో 75 సంవత్సరాల ఆజాదీ కా అమృత మహోత్సవ వేడుకలు















 భారతదేశానికి స్వాతంత్రం లభించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కార్యక్రమంలో భాగంగా సాహితీ బృందావన విహార వేదిక నిర్వహించిన 
 ఆజాదీ కా అమృత్ మహోత్సవ సంబరాల వేడుకల కవితా పోటీలో   అధిక సంఖ్యలో కవయిత్రులు ,కవులు, పాల్గొని స్వాతంత్ర పోరాటం గురించి స్వాతంత్ర సమరయోధుల గురించి, స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం సాగిన జాతీయ ఉద్యమం గురించి. భారత జాతి దాస్య శృంఖలాల విముక్తి కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను త్యాగం చేసిన ఫలితాన్ని గురించి అద్భుతమైన రచనలను అందించి దేశభక్తినీ చాటారు.
 జాతీయ ఉద్యమంలో అమరులైన వారికి కవిత నిరాజనాలు అర్పించారు.
 ఈ కవితా పోటీలలో ఉత్తమ రచనలకి  సాహితీ బృందావన విహార వేదిక నుండి ప్రశంసా పత్రాలు అందించాము అని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి నెల్లుట్ల సునీత తెలిపారు.
ఈ కార్యక్రమం వేడుకలలో పాల్గొని విజయవంతం చేసిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉత్తమ రచనలుగా నిలిచిన వారికి  వేదిక నుండి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కవితల పోటీలలో
ఉత్తమ రచనలుగా నిలిచిన వారు
రాధా సురేష్ యర్జల్  మహారాష్ట్ర
మేకల లింగమూర్తి ఖానాపూర్
కే శైలజ శ్రీనివాస్ విజయవాడ
కవిత వెంకటేశ్వర్లు కర్నూలు
చెరుకు శైలజ హైదరాబాద్
కుసుమంచి నాగమణి హైదరాబాద్
తోట సులోచన నెల్లూరు
అద్దంకి లక్ష్మి ముంబై
డాక్టర్ దాసరి శ్రీనాథ్ గౌడ్
మంచిర్యాల జిల్లా
డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ సిరిసిల్ల
మైలవరపు వెంకట లక్ష్మణరావు
కాకినాడ
పోతుల ఉమాదేవి వరంగల్
మైలవరపు వెంకట పద్మావతి కాకినాడ
గొల్లపల్లి బ్రహ్మయ్యాచార్య కాసిపేట మంచిర్యాల గార్లు నిలిచారు
కామెంట్‌లు