నిత్య సత్యాన్వేషి మా శివనాగిరెడ్డి ప్రతి మనిషి 16 గంటలు ఆలోచిస్తాడు రాత్రి 8 గంటలు నిద్ర పోతాడు రెడ్డి గారు మాత్రం 16 గంటల ఆలోచనలకు నిద్రలో ఉన్న ఎనిమిది గంటల్లో కలల రూపంలో సమాధానాలు వస్తాయి అని నేను భావిస్తున్నాను లేకుంటే అలాంటి అద్భుతమైన విషయాలు వారి ముఖతః వినలేము. అలాంటి అద్భుత విషయాలు వినడానికి కూడా అదృష్టం ఉండాలి. ఒక రోజున మాటల సందర్భంలో మీరు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ త్రిమూర్తులను నమ్ముతారు కదా. వాళ్ళను గురించి ఎందుకు అంత ప్రచారం జరుగుతోంది అన్నది వారి అమాయకమైన ప్రశ్న. అప్పుడే అనుకున్నాను ఏదో కొత్త విషయం చెప్పబోతున్నారు అని. బ్రహ్మ సృష్టించడానికి, పెంచడానికి విష్ణువు, ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని గడిపే విధానం చెప్పడానికి శివుడు కనుక వారిని పూజిస్తాం అని పెద్దలు చెప్తారు. వారు స్త్రీ రూపంలో ఉన్న వారికి ఇచ్చే స్థానం ఏమిటి? ఎక్కడ? అన్నారు. బ్రహ్మ నోటిలోనూ, విష్ణువు బొడ్డు లోనూ, శివుడు శరీరంలోనూ స్థానాన్ని ఇచ్చి గౌరవించారు అంటే నోటిలో స్త్రీని వుంచడం, బొడ్డు పైన వుంచడం, శరీరాన్ని సగం చేసి వుంచడం అన్నది వారిని గౌరవించడమా? అలా ఎందుకు చెప్పవలసి వచ్చింది అనేది మరో ప్రశ్న? నాకు పూర్తిగా తెలియదు మీ మనసులో మీరు ఏమనుకుంటున్నారో అది బయట పెట్టండి అన్నాను. బ్రహ్మ సృష్టికర్త కనుక సరస్వతీదేవిని తన నోట్లోనే భద్ర పరిచారు అని అనుకుంటున్నారు కానీ అది సాధ్యమేనా? ఒక స్త్రీ మూర్తిని నోటిలో వుంచడం సాధ్యమా? ఆలోచించండి. సరస్వతి అంటే ఎవరు మాట ఆ మాట నోటి నుంచే కదా రావడం పాంచభౌతికమైన ఈ శరీరం పంచభూతాలతో కదా ఏర్పడింది. శబ్దం అనేది విద్యకు పర్యాయపదం
అది నోటి నుంచి కదా రావడం కనుక ప్రకృతిలో మాట నోటి నుంచి వచ్చింది అని చెప్పడానికి మన పెద్దలు అలా సూచించి ఉంటారు తర్వాత లక్ష్మీదేవి స్థానం నాభి అంటే బొడ్డు శ్రీమహావిష్ణువు పాలసముద్రంలో పండుకొని వుంటాడు. జీవితంలో నేల మీద పండుకున్న వ్యక్తి వెన్నుపూస బాగా పని చేసి చక్కటి ఆలోచనలతో ప్రవర్తిస్తాడు. బొడ్డు దేనికి సంకేతం శరీరాన్ని మంచి చెడు అన్న విచక్షణ చేయగలిగి మనం తిన్న భోజనం జీర్ణమై మంచి పదార్థం పై కి చెడు పదార్థాలు కిందకు వెళ్లి పోతుంది. పై పదార్థం గుండెకు, ఊపిరితిత్తులకు సంబంధించినది మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆ గుండె, ఊపిరితిత్తులు బాగా పని చేయాలి. రక్తప్రసరణ ప్రాణవాయువుని తీసుకొని శరీరాన్ని నిలబెట్టేవి ఆ రెండే. శరీరంలోని పనికిరాని పదార్థాలను బయటకు పంపడానికి పుష్ఠాన్ని వినియోగించుకుంటుంది. అసలు లక్ష్మీదేవిని తామర పువ్వుపై నివాసం ఏర్పాటు చేయడానికి కారణం ఈ శరీరం పుష్పం లాంటిది చాలా సున్నితమైన పదార్థం. మన శరీరంలో అనేక విభాగాలు ఉన్నాయి పద్మంలో ఉన్న రేకుల వలె. అందుకోసం ఈ విషయాన్ని పెద్దలు ఆ పద్ధతిలో చెప్పి ఉంటారు. ఇక మిగిలింది శివస్వరూపం.
శివుడు అన్న దానికి శివ నాగిరెడ్డి గారి అర్థం వేరు శంకరుడు శుభాలను, సుఖాలను చేకూర్చేవాడు అని అర్థం. దాని వల్ల ప్రయోజనం అన్ని అవసరాలు ఆయన చూస్తుంటే మానవ జాతి ఏమవుతుంది వారి పనులు వారు చేసుకోవడాన్ని కూడా మానివేస్తాడు. అలాకాకుండా శంక అంటే అనుమానం ఈ భూమ్మీదకు ఎందుకు వచ్చాను మళ్లీ లోపలికి ఎందుకు వెళుతున్నాను ఈ మధ్యలో ఏం చేయాలి అన్న శంకలను తీర్చేవాడు కావాలి వారే అసలైన శంకరులు అని వారి భావన.శివ స్వరూపం అర్థనారీశ్వర తత్త్వం స్త్రీని కూడా సమానంగానే చూడాలి అన్న అభిప్రాయంతో ఆ ఏర్పాట్లు ఉన్నాయని కొంతమంది చెప్పవచ్చు. అయితే కొంతమంది ఈ అవతారం సాధ్యమా ఈ ప్రపంచంలో మనం చూడగలమా అని వాదించేవారు లేకపోలేదు. వారికి నా ఆలోచన ఈ ప్రపంచంలో మీరు పరిశీలనగా చూస్తే ఏకకణ జీవి అమీబా అది స్త్రీనా పురుషుడా రెండూ కలిసిన స్వరూపమే కదా మరి సంతానోత్పత్తి ఎలా జరుగుతుంది దానిని అదే రెండు భాగాలు చేసు కుంటుంది. అది అలా తన జాతిని పెంచుతుంది నీతులు చెప్పడానికి ఈ అవతారాలను ఏర్పాటు చేసి ప్రజలను ధర్మ మార్గంలో నడిచేలా చేయడం కోసం అనేక మంది మేధావుల కలయికతో ఏర్పడినదే తప్ప వీరు దేవతలు కారు. ఇది తప్పు అయితే క్షమించు అని అడగడానికి కూడా నేను సిద్ధమే కానీ నేను అనుకున్న దానికి విరుద్ధంగా మాట్లాడే వాడిని మాత్రం కాదు అని చెప్పిన తర్వాత అందుకే మీరు అంటే నాకు ఇష్టం లేకుంటే మీతో ఇలాంటి చర్చా కార్యక్రమాలు ఉండవు అని చెప్పేసరికి మీరు చాలా బాగా మాట్లాడతారు సార్ అని భుజం తట్టడం ఆయన వంతయింది.

చరిత్ర నుండి శాస్త్ర సాంకేతిక విఙ్ఞానం వరకు..అది ఏ రంగమైనా,ఏ అంశమైనా,ఏ విషయానైనా అవలీలగా అవగాహన పరచగల ఆచార్యవర్యులు.డా.రెడ్డి సర్. అమోఘమైన ఙ్ఞానఖని,గొప్ప విఙ్ఞానసర్వశ్వం, ఆలోచనాపరులు, మానవతావాదియైన..డా.రెడ్డి సర్ కు నిండు అభినందన వందనములు..
💐💐💐🙏🙏🙏💐💐💐

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి