ఉపాయం;-బి. గణేష్8వ తరగతి 'బి' సెక్షన్Zphs ఇందిరానగర్, సిద్దిపేట.సెల్: 9133961693
 అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు రావురూకుల. ఊరిలో గణేష్ అనే పిల్లవాడు ఉన్నాడు. 
 గణేష్ పాఠశాల లో రోజు ఏదో ఒక ప్రయోగం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు వాళ్ళ ఊరిలో వానలు కొడతాయని వాతావరణం ప్రకటించారు. అప్పుడు గణేష్ కి ఏ ఆలోచన రాలేదు. అందుకని గణేష్ 
వాళ్ల పాఠశాల సైన్స్ టీచర్ నిరంజన్ సార్ ని కలిశాడు. రామస్వామి సార్ ని కలిశాడు. 
గణేష్ ఏం చేయాలని అడిగాడు. సార్ ఒక చెక్క పడవని తయారు సైన్స్ సూత్రాల ఆధారంగా చేయమన్నాడు. అందరినీ కాపాడవచ్చు నాని అన్నారు.
కొంతమంది సహాయం తో
గణేష్ అలానే తయారు చేశాడు. ఇంకా అలాంటివి నాలుగు తయారు చేశాడు. అప్పుడే వానలు మొదలయ్యాయి. వరదలు ముంచెత్తాయి. భయపడకుండా ఉండండి  అని చెప్పాడు.
గణేష్ ఊరి వాళ్ళందరిని పడవలోకి చేర్చి గణేష్ ఒక్కొక్క పడవలో పది మంది వెళ్ళమన్నాడు. గణేష్ ఆపదలో ఉన్న వాళ్ళందరిని గడ్డకు పంపించేశాడు. వరదల నుండి కాపాడడంలో కృషి చేశాడు. 
కొన్ని రోజుల తర్వాత వానలు తగ్గాయి. ఊరి వాళ్లు మళ్లీ తిరిగి ఊరికి వచ్చారు. గణేష్ చేసిన పనికి వారి ఊరి పెద్దలు గణేష్ ని సన్మానం చేశారు. ఆనాటి సభలో ఏ చదువు చదివినా అందరికీ ఉపయోగపడే లా ఉండాలని పేర్కొన్నారు. సర్పంచ్ తన సొంత డబ్బులతో గణేష్ పరిశోధనలకు సహకారం అందిస్తానన్నాడు. 
కరతాళ ధ్వనులతో గణేష్ కి అభినందనలు తెలిపారు.
గణేష్ చేసిన పనికి అందరూ సంతోషించారు.కామెంట్‌లు