దాన ధర్మంతో దయానిధి మది దోచి
నియమ నిష్ఠతో నిరంజనుని స్తుతించి
సత్య వాక్కుతో నిత్యం కన్నయ్యని కొలిచి
సర్వం మరిచి భక్తి సంద్రంలో ఓలలాడుదాం !
మధురలో బాలకృష్ణునిగా
మహారాష్ట్రలో విఠోబాగా
రాజస్థాన్ లో శ్రీనాధ్ జీగా
పూరీ జగన్నాథుడిగా పూజింపబడే జనార్దనా !
ఉడిపిలో శ్రీకృష్ణునిగా
గురువాయూరులో గురువాయూరప్పగా
తిరుమలలో వేంకటేశునిగా
మహిమాన్విత మాధవుని మనసారా సేవిద్దాం !
లోకాన పాపం హద్దు మీరినపుడు
దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై అవతరించిన అచ్యుత
దేవకీ వసుదేవ నందన కంస చాణూర మర్ధన!
కురుక్షేత్ర సంగ్రామ రథసారథి యదుభూషణా !
భగవద్గీతా ప్రబోధకా తత్వోపదేశకా!
తులసి మాలతో విలసిల్లే శ్రీమన్నారాయణా
శంఖ చక్రధారీ శృంగార రత్నాకరా శ్రీకృష్ణా!
ముగ్ద మనోహర రూపా గోవిందా వందే జగద్గురుమ్ !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి