పల్లవి : రాఖీ ఇదేనోయ్.. రక్ష ఇదేనోయ్
అక్క,చెల్లి;అన్నదమ్ములంతజేరి
సంతసించు సంబరమిదేనోయ్
రాఖీ పండుగ ఇదేనోయ్.... :రాఖీ:
చరణం1:
అమ్మలోని అనురాగం
నాన్నతోడ అనుబంధం
అల్లుకున్న మమకారపు హరివిల్లు ఇదేనోయ్
మది మాగాణిలొ కొలువైనమధుర జ్ఞాపకమిదేనోయ్.... :రాఖీ:
చరణం 2:
చిన్ననాటి అల్లరులు
గిల్లికజ్జాల జగడాలు
గురుతుతెచ్చు కమ్మనైన పాలపుంత ఇదేనోయ్
బంధాలను బాధ్యతలను కాపాడుతు
అందంగా సాగే గుమ్మపాల గురిగ ఇదేనోయ్.... :రాఖీ:
చరణం 3:
కులమతాలను కూల్చేసి
జాతిబేధాలను దాటేసి
కర్మయుగాన్ని నడిపించే
కలగలుపు నావ ఇదేనోయ్
అందరూ నడవాల్సిన తోవ ఇదేనోయ్.... :రాఖీ:
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి