ఒక ఊరిలో ధనవంతుడు ఉండేవాడు. తను ప్రతి వారం చెత్త పడవేయడానికి తన రోడ్డు పైకి వెళ్లేవాడు. ఒక రోజున చెత్త ఏరుకుంటున్న పసిపిల్లవానిని చూశాడు. పసి పిల్లవాడు వచ్చి అయ్యా కొంచెం ఆహారం పెట్టావా అని అడిగాడు. ఆ దనవంతుడు ఏ ఇక్కడ నుండి వెళ్ళు నన్ను అడగకు. వెళ్ళిపో అని అన్నాడు. ఆ ధనవంతుడు వెళ్లాక తను పరుసు కింద పడ్డది. అది చూసిన పిల్లవాడు అది తీసుకొని అక్కడే కూర్చున్నాడు. తర్వాత ఆ ధనవంతుడి పరుసు దొరకపోవడం వల్ల వెతుక్కుంటూ అక్కడికి వచ్చి చూశాడు. ఆ పసిపిల్లవాడు తన దగ్గరికి వచ్చి ఇదిగో అయ్యా అని పరసు ఇక్కడ కింద పడింది అని అన్నాడు. తీసుకో అని అన్నాడు. అది చూసిన ధనవంతుడు కన్నీళ్ళతో తనకు కౌగిలించుకొని ముద్దాడాడు. అయితే ఆ ధనవంతుడికి పిల్లలు లేరు ఆ ధనవంతుడు ఆ పసిపిల్లవాని తన ఇంటికి చేర్చుకొని సాదుకున్నాడు. తర్వాత పసిపిల్లవాడు పెద్దవాడయ్యాక తాను కూడా ప్రతివారం కారులో వచ్చి చెత్త పాడవేయడానికి వచ్చాడు. అదేవిధంగా ఒక రోజు తన తండ్రి తోని చెత్త పడే వేయడానికి వచ్చారు. అక్కడ కూడా ఒక పసిపిల్లవాడు కనపడ్డాడు. కానీ ఆ కుమారుడు అంత పట్టించుకోకుండా చెత్త పడవెయ్యడానికి వెళ్ళాడు. ఆ పసిపిల్లవాడు ఆ కుమారుడుని దగ్గరికి వచ్చి అయ్యా నాకు ఆహారం పెట్టావా అని అన్నాడు. ఆ కుమారుడు నా దగ్గరికి రాకు అని వెళ్ళిపోయి కారులో కూర్చున్నాడు. ఇదిగో ఈ డబ్బా తీసుకొని చూడు అని అన్నాడు. కుమారుడు డబ్బా విప్పి చూసి ఇలా అన్నాడు నాన్న ఏంటిది నాకు చెత్త వేరకుంటున్న పిల్లవాడు ఫోటో నాకు ఇచ్చావు ఏంటి నాన్న అని అన్నాడు. తండ్రి ఇదిగో అది నువ్వేరా అని అన్నాడు. అది చూసిన కుమారుడు తన తాను కూడా దుఃఖముతో అక్కడ ఉన్న పసిపిల్లవాని దగ్గరికి వెళ్లి నేను కూడా నీలాగా ఉన్న వాడిని కానీ నాకు తెలియక నేను అన్నానురా అని కన్నీటితో కగిలించుకొని ముద్దడాడు. తాను కూడా పిల్లవాని తాను తన ఇంటికి చేర్చుకున్నాడు అది చూసిన తండ్రి సంతోషించాడు.
సుబుద్ధి గలవాడు ;-డి. తరుణ్, 9వ తరగతి 'ఈ' సెక్షన్, జెడ్పిహెచ్ఎస్ ఇందిరానగర్, సిద్దిపేట 9000701093
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి