జీవితంలో ధనవంతుడైనా,బీద వారైనా వారి స్థాయిలో ధనాన్ని చాలా పొదుపుగా వాడడం చూస్తాము కానీ మా శివ నాగ రెడ్డి గారి లాగా మాటలలో పొదుపును అమలుపరిచే వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు. రెడ్డి గారిలో ఉన్న సుగుణం అదే. ఆంధ్ర భాషలో ప్రతి పదానికి నానార్థాలు ఉంటాయి. ఏ పదాన్ని ఎక్కడ, ఎలా చెప్పాలో అలా చెపితేనే ఆ పదం సార్థకమవుతుంది లేకపోతే విరోధాలకు దారితీస్తోంది. మనస్పర్ధలు పెరుగుతాయి ఏమిటి నన్ను ఇంత చిన్నచూపు చూస్తూ ఉన్నాడు అని ఎదుటివారు అనుకునే అవకాశం ఉంది. ఆ పదాన్ని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడడం మా శివనాగిరెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి. అందుకే ఆయన అజాతశత్రువుగా పిలువబడుతున్నాడు. ప్రఖ్యాత సినీ దర్శకుడు వాహిని స్టూడియో యజమాని బి.ఎన్.రెడ్డి గారు తన సినిమాలో గుమ్మడి గారు తయారై బయటకు వస్తాడు వారి భార్యగా నటించిన సూర్యకాంతం లోపల ముస్తాబవుతోంది ఏమిటింత ఆలస్యం త్వరగా రాకూడదూ అని పిలుస్తాడు గుమ్మడి. ఇదిగోనండి జాకెట్టు వేసుకుని క్షణం లో వస్తాను అన్నది సూర్యకాంతం. దానికి అభ్యంతరం చెప్పారు బి ఎల్ రెడ్డి గారు. నేను బాగానే చెప్పాను కదా సార్ దాంట్లో తప్పు ఏమైనా ఉన్నదా అని అడిగాడు గుమ్మడి రచయిత వ్రాసిన దానిని చెప్పావు నీ తప్పేమీ లేదు కానీ మనం సినిమా తీసేది ప్రేక్షకుల కోసం నీవు వాచకంగా చెప్పినదానిని ప్రేక్షకులు దృశ్యంగా వీక్షిస్తూ ఉంటారు మీరు మాటల్లో చెప్పిన అర్థం వారికి చేతలలో అర్థమవుతుంది. ఆ పాత్ర ధారిణిని నగ్నంగా ఊహించుకుంటాడు అందుకే దానిని మార్చి అక్కడ ఆ పదానికి బదులు మరొకటి రాయాలి అది రచయిత పొరపాటు కానీ నీది కాదు అనగానే రెడ్డి గారి పాదాలకు నమస్కారం చేశారు గుమ్మడి గారు అలా ప్రతి అక్షరాన్ని అర్థవంతంగా చూస్తున్నారు కనుకనే రెడ్డి గారు నిర్మించిన ఏ చిత్రంలోనూ ద్వంద్వార్థాలు, అశ్లీలాలు ఇతరులను కష్టపెట్టే మాటలు ఉండవు. అందుకనే ప్రతి ఒక్కరూ తన కుటుంబంతో సహా వచ్చి ఆ సినిమా ఆస్వాదిస్తారు. ఆ సినిమాని కుటుంబంతో పాటు చూడలేము అన్నది ఏ ఒక్కటి విజయ వాహిని చిత్రాలలో కనిపించదు. ప్రతి ఒక్కరూ అంత నిష్టతో పని చేస్తారు ఈ రోజు తలచుకుంటే ఐదు పదాలున్న వాక్యంలో మూడు పదాలు తీసేయ వచ్చు. ఆ దిగజారుడు గురించి కనీసం ఆ అర్థం స్పురించేలా శివనాగి రెడ్డిగారు మాట్లాడక పోవడం వల్ల వారిని అంతా అజాతశత్రువు అని పిలుస్తారు. విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి చెబుతూ ఉంటారు వాడిని పండితపుత్రుడు అనకండిరా దానికి అర్థం కూడా వాడికి తెలియదు. అందుకే మీ నాన్న గారు చాలా గొప్ప పండితులు అంటే ఉబ్బి తబ్బిబై పోతాడు అలాగే ఒక స్నేహితుడు స్నేహితురాలికి ఫోన్ చేసి ఏం చేస్తున్నావ్ అని అడిగితే స్నానం చేస్తున్నాను అంటే ఆ తర్వాత ఈ కుర్రవాడి పరిస్థితి ఏమిటి నిద్రాహారాలు లేకుండా ఆ నగ్న దృశ్యాన్ని ఊహించుకుంటూ, కలలుకంటూ వుంటాడు. అందుకే అలాంటి శబ్దాలు నాగిరెడ్డి గారి నాలుక పలుకదు. అసలు ఆయన దానికి ఆ అవకాశం ఇస్తే కదా అంత భాషా పటిమ కలిగిన మా శివనాగిరెడ్డి గారితో ఎంత ఎక్కువ సమయం గడిపితే అంత ఎక్కువ విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పుడు తీరిక లేక వెళ్ళలేకపోయినా ఫోన్లో నైనా మాట్లాడడం ఎంతో ఆనందం.
గొప్ప స్థపతి మా శివ నాగిరెడ్డి (9)..;-ఏ.బి ఆనంద్, ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.9492811322

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి