*బుద్ధి*;-యు.నిహారిక, 9వ తరగతి 'ఈ' సెక్షన్,- జెడ్పిహెచ్ఎస్ ఇందిరానగర్, సిద్దిపేట.-సెల్:9848824085
 అనగనగా ఒక ఊరిలో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో తల్లి తండ్రి మరియు కొడుకు కలిసి ఉండేవారు. కొడుకు పేరు రాజు. రాజుకు చదువు మీద ఆసక్తి లేదు. ఊళ్లో వాళ్ళు అందరూ చాలా మాటలు అనేవారు. కానీ రాజు పట్టించుకునే వాడు కాదు. తండ్రికి చాలా బాధ అనిపించేది.  రాజు ఊళ్లో వాళ్ళందరిని కొట్టేవాడు. తిట్టేవాడు. చాలా ఏడిపించేవాడు. అల్లరి చేసేవాడు. పంచాయతీ తెచ్చేవాడు. అందరూ ఇంటి మీదకి వచ్చి గొడవ చేసేవాళ్లు. ఇదంతా విన్న తండ్రికి చాలా కోపం వచ్చి రాజుని చాలా కొట్టేవాడు.
 రాజు వాళ్ళ అమ్మకి కూడా చాలా బాధగా ఉండేది. ఒకరోజు వాళ్ళ అమ్మ పనికి వెళ్తే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ నీ కొడుకుకి చదువు రాదు. మా కొడుకులని కూడా కొడుతున్నాడు అని వచ్చిన వాళ్ళందరూ చాలా మాటలు అన్నారు. అప్పుడు వాళ్ళ అమ్మ ఏమి అనలేక బాధపడ్డది. మరుసటి రోజు వాళ్ళ తండ్రికి ఈ విషయం తెలిసింది. చాలా కోపం వచ్చింది. నా కొడుకుకు ఎలా బుద్ధి చెప్పాలి...? నేనేమి చేయలేకపోతున్నానని బాధపడ్డాడు. 
కొన్ని రోజుల తర్వాత స్నేహితులతో ఆడుకోవడానికి రాజు వెళ్ళాడు. అక్కడున్న వాళ్లంతా నీకు చదువు రాదు. నీకు క్రమశిక్షణ లేదు. మీ అమ్మానాన్న కూడా నిన్ను చదువు రాదని తిడతారు. కొడతారు. నీవు మాతో స్నేహం చెయ్యొద్దు అని అన్నారు.
 దాంతో రాజు ఏడ్చాడు. బాధపడ్డాడు. ఒంటరిగా ఇంటిలో కుగహమిలిపోతున్నాడు. రాజు పడుతున్న బాధలు చూసిన తండ్రి "ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు బాధ పడుతున్నావు" అని అడిగాడు.
 రాజు జరిగిన విషయం అంతా చెప్పాడు. నాన్న  "ఒరేయ్ రాజు నీవు చదువుకోకపోతే నిన్ను అందరూ చులకనగా చూస్తారు. నీకు విలువ ఇవ్వరు. నీవు ఎక్కడికి వెళ్ళినా అవమానమే ఎదురవుతుంది. ఇవన్నీటి కారణం చక్కగా చదవకపోడమే. చదువుకోవాలి మరియు సంస్కారంగా ఉండాలి. అందర్నీ గౌరవించడమే.
 నేర్చుకున్న విద్యను ఎవరు దొంగతనం చేయలేరు. మన దగ్గర ఉన్న ధనం పంచితే కొన్ని రోజులకు బీదవాళ్ళం అవుతాము కాని విద్య పంచినా కొద్ది పెరుగుతుంది. నీవు చదవడమే నీ జీవితానికి వెలుగు కాబట్టి ఇకనైనా చదువు అని సుతి మెత్తగా హెచ్చరించాడు. అప్పుడు రాజులో కూడా మార్పు వచ్చింది. నేను చదువుకోవాలి అందరిలో బాగుండాలి. అందరూ నన్ను గౌరవించాలి. అందరినీ నేను గౌరవించాలి. నన్ను అవమానించిన వారికి నా తెలివి చూపాలి అని నిశ్చయించుకున్నాడు.
 బడికి పోతానని వెళ్ళాడు వాళ్ల పాఠశాలలో రామస్వామి సార్ నీ కలిశాడు. సార్ చెప్పినట్టు విన్నాడు. బుద్ధిగా చదువుకున్నాడు. మంచి మార్కులతో పాసయ్యాడు. అందరితో కలివిడిగా ఉన్నాడు.ణ పదవ తరగతిలో ఎక్కువ మార్కులు రావడంతో గ్రేడ్ పాయింట్ పెరిగింది. అందరూ గౌరవిస్తుంటే సంతోషం అనిపించింది. శుభాకాంక్షలు తెలియజేస్తుంటే సంతోషం అనిపించింది.
అమ్మ ఆశీస్సులు తీసుకోవడానికి రాజు వెళ్ళాడు. అమ్మ ఆనందపడ్డది.
 నాన్న దగ్గరికి వచ్చి కాళ్లు మొక్కి "నాన్న! నువ్వు నాకు బుద్ధి చెప్పావు. నేను మారిపోయాను. నువ్వు చెప్పినట్టుగా కృషి చేశాను. అందుకే మంచి ఉత్తీర్ణత వచ్చింది అని చెప్పాడు కాళ్ళు మొక్కుతున్న కొడుకులు భుజాలు బట్టి లేబట్టి నాన్న గట్టిగా అత్తుకున్నాడు. 
జీవితంలోని ఇలాగే కొనసాగు అన్నింటిలో అంతట నీవే విజయం సాధిస్తావని చెప్పాడు.
సరే నాన్న అన్నాడు రాజు

కామెంట్‌లు