స్నేహబంధం.; -యం.వెన్నెల, 9వ,తరగతి, Zphs ఇందిరానగర్ సిద్దిపేటసెల్:9000418170
 అనఅనగా ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఒకరి పేరు రఘు మరి ఒక్కరి పేరు మహేష్. రఘు చాలా పేదవాడు. మహేష్ అనే అతను చాలా డబ్బు ఉన్నవాడు కాని మహేష్ కి అలాంటి భేదాలు ఉండేవి కాదు. రఘుకి ఆహారం ఉండేది కాదు. మహేష్ రఘుకి వాల్ల అమ్మకి తెలియకుండ వాల్ల ఇంట్లో నుంచి ఆహారం తెచ్చేవాడు. రఘుకి అమ్మ, నాన్న లేరు. మహేష్ రఘుని అమ్మ , నాన్న లేని లోటు తీరుస్తాడు. ఎప్పుడు బాధపడనివ్వడు. మహేష్ వాల్ల అమ్మ నాన్నకి రఘు అంటే నచ్చదు.  మహేష్ వాల్ల మాటలు పటించుకునేవాడు కాదు. ఒక గురువు దగ్గరికి రఘు మరియు మహేష్ ఎప్పుడు వెళ్లేవారు. అతనితో మంచిగా కలసి ఉండేవారు. అట్లానె కొన్ని రోజులు గడుస్తున్నాయి. వాల్లు ఇద్దరు పెద్ద అవుతారు. మహేష్ కి వివాహం జరుగుతది. తనకి పెళ్లి అయిన రఘుని మాత్రం అట్లనె చూసుకునేవాడు. అది గమనించిన వాల్ల బార్యకి అసలు నచ్చదు. మహేష్ తో ఎప్పుడు గొడువ పడేది. ఒక రోజు మహేష్ రఘుని కలసి వస్తుండగా రోడు ప్రమాదం జరుగుతూంది. చాలా గాయాలు అవుతాయి. తనను ఆసుపత్రికి తీసుకు వెళ్తారు. డాక్టర్ చాలా ఎక్కువ ప్రమాదం ఉంది అతనికి అని చెపుతారు. ఈ విషయం తెలిసిన రఘు ఆసుపత్రికి త్వరగా వస్తుంటే వాల్ల అమ్మ , భార్య తనని రానివ్వరు. మహేష్ ని చూడ నివ్వరు. రఘు డాక్టర్ దగ్గరికి వెల్లి నా స్నేహితుడికి ఏం జరిగింది  అని అడుగుతాడు. తనకి అగ్జిడెంట్ జరిగింది. తన కిడ్నికి చాలా గాయం జరిగింది. కాబట్టి తనకి కిడ్నీ కావాలి అని అంటాడు. డాక్టర్ దయచేసి నా స్నేహితుడీ ని కాపాడండి అని కాళ్ళ మీద పడి వేడుకుంటాడు. నేను ఇస్తా కిడ్నీ అని వేడుకుటాడు. డాక్టర్ అంటాడు. వాల్ల కన్నతల్లి, భార్యా ఎవరు ముందుకు రాలేదు కని ఒక మిత్రుడివి అయన  ప్రాణాలు ఆడు వేసి ని స్నేహితుడిని కాపాడుకుంట అని అంటున్నవు ఇంత మంచి స్నేహం నా జన్మలో చూడలేదు అని అంటాడు. డాక్టర్ కని నువు కిడ్నీ ఇచ్చాక మంచి ఆహారం మంచి పండ్లు తినాలి అని అంటాడు. సరే డాక్టర్ అంటాడు రఘు. కొన్ని రోజుల తర్వాత మహేష్ వాల్ల ఇంటి కి గురువు వస్తాడు. నీ అరోగ్యం ఎలా ఉంది మహేష్ అని అంటాడు. బాగానే వుంది. గురువుగారు అని అంటాడు. రఘు ఏడీ అని అడుగుతాడు వాడి గురించి నా దగర చెప్పకండి. నాకు ఇంత ఆరోగ్యం బాగా లేనప్పుడు ఒక సరి కూడా నన్ను చూడటానికి రాలేదు అని అంటాడు. అపుడు గురువు అంటాడు. పిచొడ నిన్ను బ్రతికించింది . రఘు వల్లనే అని జరిగింది అంత చెపుతాడు. అపుడు మహేష్ చాలా బాద పడుతడు. ఆ తర్వాత రఘు వాల్ల ఇంటికి వెళుతాడు. వెల్లగానే అక్కడ రఘు ఫొటో కి దండ వేసి ఉంటుంది. చాలా బాధపడుతూ ఏడుస్తూఉంటె ఒక ఆమ్మాయి వస్తూంది. రఘు ఎలా చనిపోయాడు అని అడుగుతాడు మహేష్. మీకు కిడ్నీ ఇచి వాచక తనకి బాగా ఆకలి వేసింది. కాని ఇంట్లో ఎమి లేవు నొప్పి తాతుకొలెక చనిపోయాడుఅని చెపుతుంది. అప్పుడు మహేష్ చాలా ఏడుస్తూ రఘు ఫొటొ పటుకొని చనిపోతాడు.
నీతి:అమ్మ, నాన్న, అన్న, చెల్లి అనే బంధాన్ని దేవుడూ ఇస్తాడు.  స్నేహితుని మనమే కలుపుకునె గొప్ప స్నేహబంధం.

కామెంట్‌లు