|| నా దేశం || ;-మచ్చ రాజమౌళిదుబ్బాక9059637442
వేదభూమి నా దేశం
త్యాగధనులు జనియించిన ధన్య భూమి నా దేశం 
కవి పండితులుదయించిన కర్మ భూమి నా దేశం 
మునివరేణ్యులు నడయాడిన పుణ్య భూమి నా దేశం

పుణ్యక్షేత్రాలకు నిలయం నా దేశం 
పురాణేతిహాసాలకు ఆలయం నా దేశం 
దేహాన్ని లెక్కచేయని రాజులకన్న నా దేశం 
దేశానికి ప్రాణమిచ్చు వీరులున్న నా దేశం

అశోకుడేలిన ధర్మ ప్రదేశం
బుద్దుడు వెలిసిన శాంతి దేశం
అహింసనే ఆయుధమై శ్వాసించిన దేశం 
శాంతి కపోతం ఎగరేసిన దేశం

నా దేశం 
ఓంకార నాదాలను ఒడిసి పట్టుకుంది
ఆకుపచ్చని సంతకాలను నేలపై రాసి పెట్టుకుంది
కళల అలల తొలుకులతో కనువిందు చేస్తుంది
అనురాగపు మమకారాలకు కొలువై నిలిచింది
ఆత్మీయపు పలకరింపులతో పులకించిపోతోంది
గంగా, గోదావరీ నదీ జలాల గల గలలలో      
అవని సంబుర పడంగ నా దేశం పునీతమౌతోంది  

పింగళి వెంకయ్యను గెలిపించిన జెండా
త్రివర్ణ పతాకమై ఎగురుతోంది ప్రతి గుండెనిండా
విశ్వ వేదికపై వినిపిస్తోంది విజయబావుటా పేరు 
జయ జయహో భారతంటు నినాదాల హోరు

కులమతాల పెనుగులాట మసకబారుతోందిప్పుడు
భిన్న మతాల సంస్కృతితో సమైక్య రాగం పాడుతోందిప్పుడు
నేనూ నా దేశమంటూ 
నలుదిక్కుల పరిమళాలు వీస్తున్నాయి
జాతి ఖ్యాతి దిగ్దిగంతాలకు వ్యాప్తి చేస్తున్నాయి.. 

_______


కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
పింగళి వెంకయ్యను గెలిపించిన జెండా
త్రివర్ణ పతాకమై వెలుగుతోంది ప్రతి గుండె నిండా
ఎంత బాగుందో ఈ నీ కవిత
కొండ వేంకట నర్సయ్య భార్గవ