అనువుగాని చోట నధికుల మనరాదుకొంచె ముండుటెల్ల కొదవుకాదుకొండ యుద్ధమందు కొంచెమైయుండదావిశ్వదాభిరామా వినురవేమాఅవకాశం లేని చోట గొప్పవారమని చెప్పుకోకూడదు.కొండ అద్దంలో చిన్నదిగా కనిపించినంత మాత్రాన్న చిన్నదైపోతుందా అన్నది ఈ పద్యం భావంప్రజా కవి వేమన ఈ పద్యంలో పరిస్థితుల బట్టి మన ప్రవర్తన మార్చుకొని మసులుకోవాలన్న సందేశాన్ని వినిపించారు. అన్ని పరిస్థితులు ఒక్కలా వుండ వు. పరిస్థితుల బట్టి మన ప్రవర్తన మారుతూ వుండాలి. మనం ఎంత జ్ఞానులమైనా అన్నివేళలా మన జ్ఞానాన్ని ప్రదర్శించుకోవాలనుకోకూడాదు. మూఢులు వద్ద మన జ్ఞానం ఎందుకూ విలువ లేకుండా పోతుంది. ఇందుకు ఉదాహరణగా అద్దంలో కొండను చూసినప్పుడు కొండ ఎంతో చిన్నదిగా కనిపిస్తుంది. కాని నిజానికి కొండను ఎక్కడి నుండి చూసినా దాని పరిమాణం ఒక్కటే. ఎక్కువవడం తక్కువవడం అనేది ఉండదు. అదేవిధంగా మన పాండిత్యం గుభాళింపు తగ్గడం అనేది వుండదు. కాని మనకు పరిస్థితులు అనుకూలించని సందర్భాలలో మన ఆదిక్యత ప్రదర్శిస్తే నవ్వులపాలవుతామని వేమన ఉవాచ.సి హెచ్ ప్రతాప్ఫ్లాట్ నెంబర్ : 405 ,శ్రీ బాలాజీ డిలైట్స్రాహుల్ కోలనీ, ఎ ఎస్ రావు నగర్సాయి సుధీర్ కాలేజీ వద్దహైదరాబాద్ 500 062
ఒదిగి ఉండే స్వభావం; - సి.హెచ్.ప్రతాప్ --సెల్ ; 91468 27505
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి