మువ్వన్నెల జెండా
ముచ్చటగా ఎగురుతుంది
ఆకాశం నిండా
సంబరాలు పండా
అదిగదిగో...నేతాజీ
అదిగదిగో... బాపూజీ
ఎర్ర గులాబీయై పిరిసిన
మన చాచా నెహ్రూజీ !
భగత్ సింగ్ ,అల్లూరి
వీరనారి ఝాన్సీ లక్ష్మి
అమరవీరుల త్యాగఫలమై
ఎగురుతున్నది మువ్వన్నెల జెండా.....
వందేమాతర గీతం పాడుదాం!
భరతమాతకు వందనాలు అర్పిద్దాం!
విశ్వకవి రవీంద్రుని జనగణగీతం పాడుదాం !భరతమాతకు హారతులెత్తుదాం !!
శాంతి - సహనం నిండుగా
మువ్వన్నెల జెండా......
ఆకాశము నిండా.........
ఎగురుతోంది స్వేచ్ఛగా....
విశ్వశాంతికై....
విశ్వ కాంతికై....
ధర్మకేతనమై....
అదిగదిగో.....తివర్ణపు జెండా
ఎగురుతున్నది ఆకాశం నిండా
భరతమాత కన్న కలలు
కాసారమై,కాంతి పుంజమై
విశ్వవీధుల్లోన ఎగురుతున్నది జెండా..........
మహా మహుల త్యాగఫలం
మన స్వాతంత్ర్యం !
మహాత్ములను స్మరించుటే
మన కర్తవ్యం !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి