వినాయకుడు - శుభకరుడు ;-రసస్రవంతి & కావ్యసుధ 9247313488
 సర్వుల నుండి
ప్రథమ వందనం
గణేశుడు విశ్వానికి
తొలి వేలుపు
మేలుకొలిపి
మేలు చేసే ఇలవేలుపు
ఇలలో సర్వులకు
ఏకైక వేలుపు
ఏకదంతంతో శోభి0చే
అంతకాంత కాత్మజుడు
పిలిచిన ఓ అని పలికే
ఓ బొజ్జ గణపయ్య.
బుద్ధి గలవారికి సిద్ధిని
ప్రసిద్ధిని ప్రసాదించే
వినయానికి నాయకుడు
వినాయకుడు.
కోరిన కోరికలు
ఈడేర్చే నాయకుడు.
అభిష్ట సిద్ధికి
సుబుద్ధికి ఈశుడు
వరాల జల్లు కురిపించే
వరసిద్ధి వినాయకుడు.

కామెంట్‌లు