పద్యాలు ; మమత ఐలకరీంనగర్9247593432
 దత్తపదులు:- తరము. కరము.తిరము. వరము (పాదాదిలో)
ఆ.వె
*తరము* గాదు పొగడ సిరిగల మాతను
*కరము* లెత్తి మ్రొక్క ధరణియందు
*తిరము* గూర్చు నంట పరిపరి విధముల
*వరము* లేలనింక నరులుగోర
దత్తపది:-తరము. కరము. తిరము. వరము
చ.
*తరము* ల గొప్ప జెప్పుకొని తాతలు నేతులు దాగిరంటు యే
*కరము* లు సాటి రావనుచు గారడి మాటల తీరునాపుచున్
*తిరము* గ సజ్జనత్వమను దీపమునార్పక పంచ వెల్గులన్
*వరము* గ నీదు బాట దెలపంగను పొందుము హాయి నప్పుడున్

కామెంట్‌లు