సమస్యా పూరణలు;-మమత ఐలకరీంనగర్9247593432
*మ్రింగ మెతుకు లేదు గాని మీసము త్రిప్పెన్*
===================================

క.
రంగా! గాంచుము చిన్నెలు
పొంగించిన సందుజూసి పొర్లుదురంటన్
భంగిమ డాబును దెలపగ
*మ్రింగ మెతుకు లేదుగాని మీసము త్రిప్పెన్* 

క.
కృంగుట నెంచక నటనల
బొంగరమై తిరుగువారి భోగము గనగన్
నింగికి నిచ్చెన లేయుచు
*మ్రింగ మెతుకు లేదుగాని మీసము త్రిప్పున్*

కామెంట్‌లు