కొత్త అందాలు!;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు. 94410 58797.
 బాల పంచపదులు
==============
1. తన కోసం భుజించాలి! ఇతరుల కోసం  ధరించాలి! 
అందంగా అవతరించాలి! ఆనందంగా సంచరించాలి !
కొత్త బట్టలు, 
         కొత్త అందాలు, రామా!
2. పుట్టినరోజు ,
             మనకెంతో మోజు! అభ్యంగనం ఇంటి రివాజు! 
కొత్తబట్టల్లో నీవు మహారాజు! చూసేవారికి నీవే రారాజు!
కొత్త బట్టలు ,
        కొత్త అందాలు రామా!
3. పండగల అంటే,
              కొత్త బట్టలు! పెళ్ళిళ్ళు అంటే ,
                కొత్త బట్టలు! శుభకార్యాలు అంటే,,
                  కొత్త బట్టలు! పెద్దలు కలిస్తే ,
                 కొత్త బట్టలు !
కొత్త బట్టలు,
           కొత్త అందాలు, రామా!
4. కొత్తబట్టల్లో ,
        దేవతలు ఉంటారు !
 ధరిస్తే నిన్నంటి ఉంటారు !
నీకు దీవెనలు ఇస్తారు !
నీ వెన్నంటి నడిపిస్తారు!
కొత్త బట్టలు ,
     కొత్త అందాలు, రామా! 
________


కామెంట్‌లు