బాల పంచపదులు==============1.ఉంగరాల జుత్తు,మరళితో పొత్తు!తలపై మెరిసే,పించం గమ్మత్తు!గోపాలురందరికీ,అతడే దోస్తు!అతడి పేరులో,ఉంది మత్తు!అల్లరివాడు,అందరివాడు, రామా!2.చెరసాలలో పుట్టినవాడు!రేపల్లె కలయచుట్టినవాడు!దేవకివసుదేవుల సుతుడు!యశోదానందుల,ముద్దులబిడ్డడు!అల్లరి వాడు,అందరివాడు రామా!3.అందరినీ ఆకర్షించేవాడు!అందరినీ ఆకట్టుకునేవాడు!అందరిలో కలిసిపోయేవాడు!అందరూ కోరుకునేవాడు!అల్లరివాడు,అందరివాడు, రామా!4.సంపూర్ణ అవతారుడు!దుష్టశిక్షణకై వచ్చినవాడు!శిష్టరక్షణ చేపట్టినవాడు!మదులు దోచే చక్కనివాడు!అల్లరివాడు,అందరివాడు,రామా!5.బాలలీలలు ,అమృతసుధలు!వెన్నెలలో ఆనంద,బృందావనాలు!ప్రతిధ్వనించే,వేణునాదాలు !రేపల్లె అణువణువు,ఆపాదాలు!అల్లరివాడు,అందరివాడు, రామా!6. అమ్మని ఏడిపించాడు,లొంగాడు!నోటిలో భువనాలు,చూపించాడు!ఇంటిపై ,తగువులు తెచ్చాడు!వెన్నకై ఇళ్ళన్నీ,కొల్లగొట్టాడు!అల్లరివాడు,అందరివాడు, రామా!7. మన్ను తిన్నాడు,వెన్న తిన్నాడు!అందరికీ వెన్న,తినిపించాడు!కన్నయ్య,అందరి మది దోచాడు!ప్రేమగురుతై ,విశ్వాన నిలిచాడు!అల్లరివాడు ,అందరివాడు ,రామా!8. అతడు వటపత్రసాయి!తలచినంత,మనసంతా హాయి!అందరంటారు,ఇటు రావోయి!ఇక,మావాడివి,నీవేనోయి!అల్లరి వాడు,అందరివాడు రామా!_________
ఈ అష్టమి పున్నమి!;-డా, పి.వి.ఎల్. సుబ్బారావు.9441058797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి