ఆనంద పానం;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.9441058797.
బాల పంచపదులు
==============

1. కోకిల ఆలపించే గానం!
   మనకు ధర అమృత పానం!
   గురువు నేర్పని సంగీతం!
   కోయిల ఒక్కదానికే సొంతం!
   కోకిల గానం ,
        ఆనందపానం, రామా!

2. మావికొమ్మ ఊగే కోయిల!
    సప్తస్వరాల నవ్యపాఠశాల!
జగమంతా తడిసే నవరసాల!
 వసంతమైనా  తలఊపాలా!
కోకిల గానం ,
        ఆనంద పానం, రామా!

3. కోకిలపాట ,నెమలిఆట!
   పూలతోట, వెన్నెలఇంట!
  ఉంటే మనం ప్రతి పూట!
  బతుకు ఆనందాల కోట!
  కోకిల గానం ,
      ఆనంద పానం ,రామా!

4. మేని రంగు నల్లటి నలుపు!
   నోట పొంగు కమ్మటి పిలుపు!
   ఆమె కూసిదంటే కాసేపు!
   సంగీతమే తెరుచు తలుపు!
   కోకిల గానం ,
          ఆనంద పానం ,రామా!

5. కాసుకోరని కళాకారిణి!
   వేదిక అడగని విద్వన్మణి!
   గానమా అమృతవర్షిణి!
   సరిలేని ఓసంగీతకర్షిణి!
   కోకిల గానం, 
         ఆనంద పానం ,రామా!
_________


కామెంట్‌లు