బాల పంచపదులు
=============
1. సీత ,
కోరకుంటే బంగారు జింక!
రామ కథ ,
సాగేది మరో వంక!
రాముని ,
పరిగెత్తించిన ఆ జింక!
రామునికి ,
చూపించింది లంక!
జింకల్లా,
ఉత్సాహం ఉరకాలి, రామా!
2. మారీచుడి రూపం జింక!
రాముడి బాణం తగిలాక!
కెవ్వున కేకేసి నేలకొరిగాక!
తీరేగా అతని నిజ కోరిక!
జింకల్లా,
ఉత్సాహం ఉరకాలి, రామా!
3. పాండురాజు ,
వేటాడిన జింకలు!
అతనికి ఇచ్చె,
ఘన శాపాలు!
అయ్యే ,
కుంతి వరాలు సార్ధకాలు!
పాండవుల ,
ఆవిర్భావ కారకాలు!
జింకల్లా ,
ఉత్సాహం ఉరకాలి ,రామా!
4. వనాలకు ,
అందాలు లేళ్లు!
పరుగులు చూడు ,
దూకే సెలయేళ్లు!
బెదురు చూపుల ,
ఆ సోగకళ్ళు!
మనల్ని ,
కట్టిపడేసే సంకెళ్లు!
జింకల్లా ,
ఉత్సాహం ఉరకాలి, రామా!
5. జింకల వేటలు పోవాలి!
జింకల రక్షణ జరగాలి!
జింకల పార్కులు పెరగాలి!
పిల్లలు చూసి మురియాలి!
జింకల్లా ,
ఉత్సాహం ఉరకాలి, రామా!
6. జింకల్లా ,
పరుగులు తీయండి!
చిలకల్లా,
పలుకులు పలకండి!
ఉడతల్లా ,
సాయానికి ఉరకండి!
ముచ్చటైన పౌరులు,
మీరే కదండీ!
జింకల్లా,
ఉత్సాహం ఉరకాలి, రామా!
_________
ఉత్సాహం ఉరకలు!;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.9441058797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి