బాల పంచపదులు
================
1. అమ్మ, ఆవులతో ఆరంభం!
మన చదువుల సంరంభం!
అమ్మ ప్రాణం ,ఆవు ధనం!
అమ్మ ఆవులే మన జీవనం!
గోమాత ,
విశ్వమాత, దేవత ,రామా!
2. తల్లి లేని బిడ్డలకు మాత!
తనపాలిచ్చి పెంచు గోమాత!
ఆమె సర్వ దేవతా సమేత!
జనహిత, సదా పూజిత!
గోమాత,
విశ్వమాత, దేవత, రామా!
3. గడ్డితిని పాలిచ్చే,
మహిమాన్విత!
ఇంట నడయాడే,
మంగళ దేవత!
ఆవే అసలైన ,
ఆరాధ్య దేవత!
ఆవున్న ఇల్లే ,
శుభాల అధినేత!
గోమాత ,
విశ్వమాత, దేవత, రామా!
4. ఆవు విసర్జకాలు ,
అతి పవిత్రం!
ఆవుపేడ ,
పరిశుభ్రత చిహ్నం!
ఆవుమూత్రం,
ఔషధతుల్యం!
గృహప్రవేశం ,
ఆవు,దూడ ముఖ్యం!
5. ఆవుపాలు ,
ఉత్పత్తులు ఉత్తమాలు!
అవన్నీ సరి,
అభిషేకద్రవ్యాలు!
ఆజ్యంతోనే సాధ్యాలు,
అన్నియజ్ఞాలు!
ఆవు సర్వాంగాలు,
మన ఆరాధ్యాలు!
గోమాత ,
విశ్వమాత, దేవత రామా!
6. గోవుదర్శనం,గోవుప్రదక్షిణం!
గోవుసేవనం,గోవుపూజనం!
గోవుఆరాధనం, అనన్యం!
గోవుతోనే సాధ్యం,
భవతరణం!
గోమాత,
విశ్వమాత, దేవత, రామా!
7. గోవులే ,
అసలైన సంపదలు!
గోవుల ,
సంరక్షణ పెన్నిధులు!
గోవుల,
రక్షణ మన బాధ్యతలు!
గోవులే,
మన పాడిపంటలు!
గోమాత ,
విశ్వమాత, దేవత, రామా!
8. మనిషి ఆవుపాలై,
మరగాలి!
మాలిన్యం పోయి,
చిక్కబడాలి!
పెరుగై బాగా ,
చిలకబడాలి!
వెన్న నేయిగా ,
నిలబడాలి!
గోమాత,
విశ్వమాత, దేవత, రామా!
9. ఆవు దూడలు,
అందాల కాంతులు!
చెంగుచెంగున,
వేసే గంతులు!
పిల్లలకవే,
సరదాల సంతలు!
దూడల వెంట ,
ఏమా పరుగులు!
గోమాత,
విశ్వమాత ,దేవత ,రామా!
,10. గోవులు కాసే గోపాలుడు!గోవుతోనున్న,వేణుగోపాలుడు!
రేపల్లె గొప్ప కథానాయకుడు!జనహృదయ,
నిత్యమనోహరుడు!
గోమాత ,
విశ్వమాత, దేవత, రామా!
_________
విశ్వమాత!;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు. 9441058797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి