నాయక నమూనా!;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.9441058797

 వినాయక చవితి శుభాకాంక్షలు అందిస్తూ,
==============================     
  బహు యోగ్యుడు,
               ప్రథమ పూజ్యుడు!
విఘ్నాలపై ఆధిపత్యం,
           అదే సాఫల్య రహస్యం!
పరిశీలనకు చిన్ని కనులు,
శ్రవణానికి విశాలమైన చెవులు!
పూర్తిగా శాఖాహారం,
       జీర్ణానికి విశాల ఉదరం !
తన కాయం ,
     సంపూర్ణంగా తన ఆధీనం!
చిన్న వాహనమైనా,
       అధిరోహించే సామర్థ్యం!
ప్రసన్న వదనం ,
    నాయకత్వ ప్రధాన లక్షణం!
అమ్మానాన్నల ఆరాధన,      ఆరాధకుల కార్యసాధన!
జీవితాన కావలసింది బుద్ధి, తద్వారా ఆశయసిద్ధి!
బుద్ధి సిద్ధిలతోనే ,
నాయక జన్మ ఇల కడు ప్రసిద్ధి!
_________
.
కామెంట్‌లు