ప్రత్యక్ష దైవాలు. (మణిపూసల ప్రక్రియ గేయం);-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.
గీత దాటని పిల్లలం
రాతమారిన మల్లెలం
మేం సదా వెలుగుతుంటం
కలిమి కలిగిన పోరలం  !

మణిపూసలంటే ఇష్టం
రాయడమే మాకు కష్టం
అయిననూ రాస్తున్నాము
అని చేస్తున్నాం స్పష్టం !

మాకు అమ్మానాన్నలు
ఆరాధ్య దైవాలు
మేం వారిని పూజిస్తాం
వారు వెలిగే దేవతలు !

వారిక మా ఇష్టాలను
మేం పడేటి కష్టాలను
రోజూ చూస్తుంటారు
తీర్చేరు మా కలలను !

కోరుకున్నవి ఇస్తారు
మంచీ చెడు చూస్తారు
ఉంటారిక మా వెంట
మమ్ములను దీవిస్తారు !

చెప్పినట్లుగా వింటాం
నిత్యం బడికి పోతుంటాం
వారికి మాటే వేదం
అని తలస్తూ మేముంటాం !

మాకు గురువంటే ప్రేమ
వారే మాకిక ధీమా
బోధిస్తారు పాఠాలను
పడతారు మాకై శ్రమ !

ఆ బడిలో చదివింక
మేమెంతో ఎదిగింక
వస్తాంగా గురువు కడకు
పూజిస్తాం వారినింక !

గురుభక్తి చాటుకుంటూ
వారు మా  దేవుడంటూ
ఇక ఇలమేం భావిస్తాము
వారినిక పొగుడుకుంటూ !

అమ్మా నాన్నలు గురువులు
కనిపిస్తున్న దేవతలు
మన వెల్లంటే ఉంటారు
అందిస్తారు కడు శుభములు !


కామెంట్‌లు