సేవకులం-పాలకులం;-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.
మురళీ ధ్యానం పిల్లలం
మారవళీ గానం మల్లెలం
మాధవ దేవుని సేవకులం
మానవ జీవుని పాలకులం!

బృందావనంలో మేం ఉంటాం
బృంద గానమును ఇక వింటాం
మాధవుడే మా దేవుడు అంటాం
విధేయులమై ఆయనతో ఉంటాం!

వస్తారులే అందరు గోపికలు
ఇస్తాములే సుందర జ్ఞాపికలు
పుచ్చుకొని చేరుతారు ద్వారక
మెచ్చుకొని హరి తీర్చులే కోరిక !

బృందావన పెద్దలను కలుస్తాం
బుద్ధిగా వారి సరసన నిలుస్తాం
వారు చెప్పే సుద్దులు వింటాం
మీరే మా పెద్ద దిక్కని అంటాం !

సుదర్శన చక్రం తిప్పిన కృష్ణుడు
గోవర్ధన పర్వతం ఎత్తిన శ్రీకృష్ణుడు
అతడే మా ముద్దుల మురహరుడు
ఇతడే మా రేపొద్దుల సుందరుడు

మా మురళీధరుని  ధ్యానిస్తాం
ఆ కమలాకరుని మేం పూజిస్తాం
మా లిఖిత కవితలతో అర్థిస్తాం
ముకుళిత హస్తాలతో ప్రార్థిస్తాం !

బృందావన పురజనుల పిలుస్తాం
బృంద సామూహిక శక్తిని తేలుస్తాం
కలిసుంటే కలదు సుఖం అనిపిస్తాం
జన బుధ జనులకు మాపిలుపిస్తాం

మా  కోరిక మన్నించి  పెద్దలందరు
ఊరి బాగోగులు పట్టించుకొందురు
మాధవ సేవే మానవ సేవ అందురు
 వారంతో ఇంతో తెలుసు కుందురు

మేం మా పురజనుల కోరిక మేర
మా పురపాలకుల మైనాము తీరా
ఓ బృందావన విహారి దీవించరావా
నీమహిమతోచూపించు మాకోత్రోవ

మన మానవుడే మాధవుడన్న
ఘన నరుడే నారాయణుడన్న
వైనం తెలిపినాం ఊరి వారికి
సైయని మలిపినాం కొత్త దారికి !


కామెంట్‌లు