ఓటి కుండ;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.9492811322.
 సత్యం వద నిజమునే చెప్పుము అని వేదం చెబుతోంది  చెప్పడమే కాదు  సత్య హరిచంద్రను ధర్మరాజు లాంటి  సత్య నిష్ఠ కలిగిన  గొప్ప వ్యక్తుల జీవితాన్ని  కథారూపంలో కూడా మనకందించారు. కొంతమంది వుంటారు ప్రతి చిన్న విషయానికి కూడా అబద్ధాలు చెప్పడం అలవాటు చేసుకుంటారు.  ఎందుకు అలవాటు అయిందో కూడా వారికి తెలియదు. ఒక అబద్ధం ఆడితే దానిని  సమర్థించుకోవడానికి 100 అబద్ధాలు ఆడాలి. వాడు ఏ అబద్ధాలు చెప్పాడో అవి గుర్తుపెట్టుకోవాలి దానిని సమర్థించడానికి చెప్పిన పదార్థాలన్నింటిని కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. లేకపోతే దొరికిపోతాడు. అంటే బాగా జ్ఞాపకశక్తి ఉన్నవాడు మాత్రమే అబద్ధాలు ఎక్కువగా చెప్పగలడు అబద్ధాలు ఆడితే ఆడపిల్ల పుడుతుంది అని సామెత. ఆ రోజుల్లో ఆడపిల్ల పుట్టిందంటే కుటుంబానికి ఎంతో భారం కట్నకానుకలు సమర్పించడం ఒక ఎత్తు,  పెట్టు పోతలు మరో ఎత్తు. వారి ఆస్తి మొత్తం అమ్ముకోవాల్సిందే. ఇలాగైతే వీరు అబద్ధాలు మానేస్తారని మన పెద్దలు సృష్టించిన నానుడి. దానిని ఏమన్నా దంటే వేమన బెజ్జం పడిన కుండలో నీళ్లు పోస్తే  అది ఉంటుందా?  లక్ష్మీదేవి కూడా అంతే కల్లలాడే వాడి ఇంట ఉండడం ఆమెకు నచ్చని విషయం. సత్యాన్ని  దైవ స్వరూపంగా చెప్పారు వాల్మీకి మహర్షి  ధర్మాన్ని ప్రతిష్టించడం కోసం ఆయన వ్రాసిన అద్భుతమైన శాశ్వతమైన గ్రంథం రామాయణం ధర్మం నిలిచి ఉండాలి అంటే  తప్పకుండా సత్యవంతుడై ఉండాలి అన్న విషయాన్ని చెప్పడం కోసం  మహర్షి చెప్పినది. అలాంటి మనిషి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాడు.  దరిద్ర దేవతను బయటకు గెంటాలని ప్రయత్నం చేస్తాడు. ఆమె నిజాలు చెప్పే వారి ఇండ్లలో తన కాలు మోపుతుంది లక్ష్మీదేవి కూడా అక్కడ ఉండడానికి అంగీకరింస్తుంది. ఇక అబద్ధాలు చెప్పే వారిని ఎవరూ నమ్మరు సరికదా లక్ష్మీ దేవి కూడా వారి ఇంట అడుగు పెట్టాడు. వాడు అత్యవసరంలో నిజాలు చెప్పిన వాడి అబద్ధాలు నమ్మకండిరా అనే ప్రజలు అంటారు తప్ప ఏ మాత్రం గౌరవ మర్యాదలు ఉండవు. అలాంటి స్థితి రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా వేమన మనలను హెచ్చరిస్తూ ఈ ఆటవెలది మన ముందుంచారు.

"అరయ తరచు కల్లలాడెడు  వారిండ్ల వెడలకేల లక్ష్మి విశ్రమించు ఓటికుండ నీరు   పోసిన చందాన..."


కామెంట్‌లు