పాత్రికేయుడు వర్మ;ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.9492811322
 నేను నెల్లూరులో ఉన్నప్పుడు  వర్మ గారు పాత్రికేయులు  నాతో రేడియో విషయాల గురించి, అనేక సమస్యల గురించి సమాధానాలు తెలుసుకోవాలని  ఓ రోజు ప్రత్యేకంగా సభా కార్యక్రమం ఏర్పాటు చేసి  రేడియోలో ప్రవేశాలు ఎలా జరుగుతాయి  నాటకాలు ఎలా ప్రారంభిస్తారు, ఎలా చేస్తారు  దాని గురించి మాట్లాడమంటే మాట్లాడాను.  ఆకాశవాణి నాటకాలలో పాల్గొనాలని ఉన్న వారికి ఆడిషన్ పెట్టి గొంతు ఎలా ఉంది అని చూడడం మొదటిది అవునవును  అన్న శబ్దాన్ని తొమ్మిది రకాలుగా మాట్లాడటం ఎలా?  ఆశ్చర్యంగా, ఆనందంగా, వినోదంగా, బాధగా, దుఃఖంగా  రకరకాలుగా మాట్లాడవలసి ఉంటుంది. దానిని ఎలా చేయగలుగుతున్నాడు అనేది చూస్తారు. తర్వాత ఒక వాక్యం  విషయం నీకే నేనెంత తపించుచుంటినో నీకేమీ తెలియునో అన్న వాక్యాన్ని నాలుగు రకాలుగా చెప్పాలి.  గురువుతో, ప్రేయసితో, దుఃఖంగా, బాధగా  చెప్పగలిగిన వారిని ఎంచుకుంటాను. దీనితోపాటు  పురాణ ఇతిహాసాల లోని పాత్రల  వాక్యాల నుంచి   దానికి చదువమంటాను. అలాగే  సాంఘిక నాటకాలు  జానపద నాటకాలలో  తెలంగాణ యాస  శ్రీకాకుళం వారి మాట్లాడే పద్ధతి  విజయనగరంలో ఎలా మాట్లాడుతారు కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఎలా మాట్లాడుతారు ఆ వాక్యాన్ని ఇచ్చి చదివిస్తారు. వీటిలో సరిగా చదవగలిగిన వారిని  ఎన్నిక చేస్తారు. వాక్యాలలో అక్షరాలను  సరిగా అర్థం చేసుకోలేక చదువు లేకపోయినా దానిని పరిగణలోనికి తీసుకోవడం  ఉండదు. మాకు వచ్చే వారంతా వేదికపై నటించిన వారే వస్తారు  ఆకాశవాణి బాణీ వారికి తెలియదు  ఎక్కడ ఎక్కువ శృతిలో చెప్పాలి  ఎక్కడ తక్కువలో చెప్పాలి  ఇలా చేసేటప్పుడు మైకుకు ఎంత దూరంలో ఉండాలి  పదిమంది  బృందం గా ఉన్నప్పుడు మైకును ఎలా ఉపయోగించుకోవాలి  ఈ విషయాలన్నీ తెలిస్తే తప్ప రేడియోకి పనికిరారు. దానిని అవగాహన చేసుకున్న వారికి వచ్చే పేరు ప్రఖ్యాతులు ఇంత అని చెప్పలేం. ఇది ఆ ఛాయా చిత్రం. ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్న వారు  చలపతిరావు గారు, అధ్యక్ష స్థానంలో వర్మగారు ప్రక్కన నేను, ఆ ప్రక్కన గుర్నాథ్ గారు ఉన్నారు.కామెంట్‌లు