తేనె తెరలు;-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.9492811322.
 మానవ శరీరంలో ఉన్న మనసు రకరకాల కోరికలతో ఉంటుంది ఏ కోరిక ఎందుకు వస్తుందో, ఎలా వస్తుందో దానికి తెలియదు. అది స్నేహితుల వల్ల వారి అలవాట్ల వల్ల రావచ్చు  జీవిత అవసరాలను తీర్చుకోవడానికి కావచ్చు కారణాలు ఏవైనా అనుకున్న విషయాన్ని సాధించడం కోసం శరీరం మనసుకు సాయపడుతూ ఉంటుంది. మనసు ఎలా ఆడమంటే అలా ఆడుతుంది. శరీరము అందమైన వస్తువులను చూసి అది తన సొంతం చేసుకోవాలనుకున్న మనసు చేతిలో డబ్బు లేక జరిగే సంఘర్షణ, శరీరానికి మనసుకు మధ్య కొట్లాట అది దొంగతనానికి దారితీస్తోంది.  అది కొనే అంత డబ్బు దొరకకపోతే ఆ వస్తువునే దొంగిలించడం మానవ నైజం.  అలాగే ధూమపానం, జూదం,  వ్యభిచారం తాగుడు లాంటివి  స్నేహితుల వల్ల ప్రారంభమై ఈ దురలవాటు మనసును స్వాధీనం చేసుకొని దానిని వ్యసనంగా మార్చుకుంటుంది. అది లేకపోతే జీవితం లేదు అన్న పద్ధతిలో  వ్యవహరిస్తూ ఉంటాడు. భ్రమరం (తుమ్మెద) తన ఆహార సముపార్జన కోసం  ప్రతి చెట్టు తిరుగుతుంది. ఎక్కడ పుష్పం వికసిస్తుందో  దానిపైన వాలుతుంది.  తనివితీరా మధును గ్రోలి  కడుపు నింపుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ రేపటి కోసం దానిని దాచుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. కొన్ని వందల వేల తుమ్మెదలు పెట్టిన  తేనె తుట్టి మనకు ఎంతో ఆరోగ్యాన్నిస్తుంది పుష్పం పై వాలిన తేనెటీగ రాత్రి సమయంలో పుష్పం రేకులు ముడుచుకుపోవడంతో  లోపల బందీగా ఉండి తెల్లవారి తెరుచుకున్న తర్వాత బయటకు వస్తుంది ఎంతో కష్టపడితే కాని, ఆ తేనెను  పొందలేదు. అలాగే జ్ఞానాన్ని సంపాదించు కోవాలి అనుకున్న వ్యక్తి సద్గురువు ఎక్కడ ఉన్నాడో అన్వేషించి తెలుసుకొని వారికి పాదాక్రాంతమై విద్యలు నేర్చుకుంటాడు దేనిని సంపాదించాలి అనుకుంటాడో దాని కోసం మానవుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. దానిని సాధించిన తరువాత దానికి బానిసగా మారతాడు అంటూ వేమన అందంగా చెప్పిన ఆటవెలది. ఇంత చిన్న పద్యంలో వేదాంత సారం మొత్తాన్ని చెప్పినవాడు  రసము అంటే  దైవము అని అర్థం. తేనెటీగ తుమ్మెద జీవం అయితే రసం దైవం దేవుని దగ్గరకు జీవుడు ఎలా చేరుతాడో అలాగే భక్తులు పరమయోగి పరమాత్మే భక్తుడు జీవుడే  తేనెటీగ తుమ్మెద జీవుడు వీటి పరమ గమ్యం పరమాత్మే. జాడ తెలిస్తే గమ్యం చేరడం సులభం తెలియకపోతే అంతా అయోమయం. అది వేమన మనకు చెప్పిన నీతి.

"తేనె తెరల జాడ తేనెటీగ ఎరుంగు 
సుమరసంబు జాడ భ్రమర మెరుగు  
పరమయోగి జాడ భక్తుడెరుంగును..."

కామెంట్‌లు