జీవితంలో ప్రతి వ్యక్తి విద్యాధికుడు కావాలని కోరుకుంటారు. అక్షరాభ్యాసం నుంచి ఉన్నత పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయాలలో నేర్పే అన్ని విషయాలను తెలుసుకోవడానికి ఉబలాటపడతారు. దానిలో అన్ని నేర్చుకుంటారు భాష మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఇంకొంచెం నేర్చుకోవాలన్న కుతూహలం కనపరుస్తూ దాన్ని కార్యరూపంలో పెడతారు. ముందు పంచ కావ్యాలను చదువుతారు. అర్థం చేసుకున్న తర్వాత ఏం చేస్తారు దానికి వ్యాఖ్యలు రాయడానికి కూడా ముందుకు వస్తారు ఎన్నో సభలలో తన ప్రసంగాల ద్వారా దాని మూలాలను తెలియజేయడానికి విశ్లేషించి చెప్పడానికి ప్రయత్నం చేస్తారు మనకున్న 56 అక్షరాలను ఏ అక్షరానికి, ఏ అర్థంవుందో కూడా నిఘంటువుల ద్వారా, గురువుల ద్వారా నేర్చుకొని దానినే ప్రచారం కూడా చేస్తూ ఉంటారు. తనకు పేరు రావాలన్న కోరికతో కాకుండా భాషా సేవ పేరుతో చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వ్యాసుల వారు రాసిన భారతంలో కానీ, వాల్మీకి మహర్షి రాసిన రామాయణం లో గాని అటు ధర్మాన్ని ఇటు న్యాయాన్ని మాత్రమే కాక ధర్మ సూక్ష్మాలను కూడా వెలికితీసే ప్రయత్నం చేస్తూ వాల్మీకి మహర్షి గొప్పతనాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే వ్యాసుల వారు చెప్పిన న్యాయాన్ని ఎలా వ్యక్తీకరించారు, ఎలా ఉంటే వేరే అర్థాలు వస్తాయో దానిని కూలంకషంగా అర్థం చేసుకొని ప్రేక్షకులకు అందించడానికి ప్రయత్నం చేస్తారు. నిజానికి జీవితమంతా దాని కోసం ధారపోసినట్టు దానికోసం తన సుఖాలను కూడా వదులుకుంటారు. ఇలాంటి జ్ఞాన సంపన్నులకు కొంచెం కోపం, కొంచెం చికాకు ఏర్పడడం సహజం. తను చెప్పింది అర్థం కాని ప్రేక్షకుడు కానీ, శ్రోతలు కానీ ఉంటే వారిని చూసి కోపగించుకుంటారు. మధ్యలో జరిగిన విషయం ఏదైనా అడిగితే ఆ వ్యక్తితో చిరాకు తో మాట్లాడుతూ ఉంటారు. అంత ప్రపంచ జ్ఞానం తెలిసిన విజ్ఞాని తనలో సహనాన్ని కోల్పోతే ఎలా ఉంటుంది తాను చేసిన ప్రయత్నమంతా వృధా కదా అలాంటి వాడు ఎంత గొప్ప వేదాంతం చెప్పినా జీవిత సత్యాలు నెమరు వేసిన అతనంటే గౌరవం ఉంటుందా? అలాంటి స్థితి కి మీరు వెళ్ళవద్దు అని వేమన తన ఆటవెలదిలో స్పష్టంగా చెప్పారు. ఆ పద్యాన్ని చదివితే మీకు అర్థమవుతుంది.
"బహుళ కావ్యంబులను బరికింపగవచ్చు
బహుళ శబ్దచెయము పలు కవచ్చు
సహనం యొక్క టబ్బ చాల కష్టంబురా..."
"బహుళ కావ్యంబులను బరికింపగవచ్చు
బహుళ శబ్దచెయము పలు కవచ్చు
సహనం యొక్క టబ్బ చాల కష్టంబురా..."
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి