దాన మహిమ;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.9492811322.
 మనిషి నూరేళ్లు జీవించడానికి ప్రకృతి తనకు శరీరాన్ని ప్రసాదించింది. పాంచభౌతికమైన ఈ శరీరాన్ని తాను ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అసలు స్త్రీ పురుష భేదం ఏమిటి? ఎందుకు అలా సృష్టించాడు? సంతానోత్పత్తి కోసం అనుకుంటే  ఆధిపత్యపోరు ఎందుకు వస్తుంది? నేను ఎక్కువ నీవు తక్కువ ఈ భేదాలు ఉండకూడదు కదా నిజానికి  ఇద్దరి మనస్తత్వాలను అర్థం చేసుకునే ముందు స్త్రీ తత్వం ఎంత సున్నితంగా మృదువుగా ఉంటుంది. ఆమె లాగా సర్దుకుపోయే గుణం పురుషునికి ఉంటుందా? అలా తయారు కావడానికి కారణం  తల్లిదండ్రులే కదా. తల్లికి ఈ విషయం తెలిసినా వివక్షతను అనుభవించినా తిరిగి తన సంతానంలో పురుషునికి ఎందుకు ఆధిపత్యాన్ని  కట్టబెడుతుంది కారణాలు ప్రకృతికే తెలియాలి. చరిత్రను తిరగ వేస్తే ఇద్దరూ కాయకష్టం చేసి జీవించిన వాళ్లే రాతి యుగంలో, తర్వాత కుటుంబ వ్యవస్థ ఏర్పడి ఇలాంటి అవలక్షణాలకు ఆలవాలమైంది. ఒక యాచకుడు గుమ్మం ముందుకు వచ్చి మాతా కవళం అంటాడు తప్ప  అయ్యా అని ఎందుకు అనడు. అమ్మకు మాత్రమే బిడ్డ ఆకలి తెలుస్తుంది కనుక  ఆకలి తీర్చడానికి వెనక ముందు ఆలోచించదు ఇది వెయ్యాలా వద్దా అన్న ఆలోచన రాదు. ఏదైనా మనకు వున్నది ఇవ్వాలని వారి అవసరం తీర్చాలని మనసులో అనుకున్నప్పుడు మనం ఎంతవరకు ఇవ్వగలము అంత ఇచ్చి ఆదుకోవడం,  ఎవరైనా నాకు ఈ ఆపద వచ్చింది సాయం చేయండి  అది ధనరూపంలో కావచ్చు, వస్తు రూపంలో కావచ్చు, మరే రూపంలో నైనా కావచ్చు అలా వచ్చిన వారిని అసంతృప్తితో పంపించక అతని మాట విని వాడు అవసరంలో ఉంటే  తప్పకుండా వెళ్లి మాట సాయం చేయాలి. తన సాయం అంటే తాను కొంత ఇవ్వాలి లేకపోతే లేదని చెప్పాలి. వస్తు రూపంలో  అయితే తన ఇంట్లో ఉన్నది అయితే తనకు సరిపడినది వుంచి మిగిలిన దానిలో దానం చేయాలి. అలా చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించకూడదు. అలా చేసిన దానం తిరిగి వస్తుందని ఆలోచన రాకూడదు. అతని అవసరానికి సహాయ పడ్డామని ఆనందించాలి.  నిజానికి అది ఎంత ఆనందాన్ని ఇస్తుంది. దానికి అలవాటు పడమని వేమన  మనకు సలహా ఇవ్వడం కోసం వ్రాసిన పద్యం ఇది.

"అరయ నాస్తి యనక యడ్డు మాటాడక  
తట్టుబడక మదిని దన్ను కొనక  తనదిగాద్దనుకొని తా బెట్టునదే పెట్టు...."


కామెంట్‌లు