మల్లి బ్రతుకు;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.9492811322.
 సామాన్యంగా ప్రతి రైతుకి  ఉల్లిపాయ ఎలా పండించాలో మల్లి ఎలా పండించాలో తప్పకుండా తెలిసి ఉంటుంది.  మల్లి వికసించేటప్పుడు ఎంతో అద్భుతమైన,  సుమధురమైన  వాసనలను విరజిమ్ముతుంది. ఉల్లి కొంచెం ఘాటుగా వాసన  ఈ రెండు భేదాలు తెలుసు రైతుకు అందుకే ఈ తోట విషయం చెప్పడం. దాని మొక్కలు దానికి, దీని మొక్కలు దీనికి నాటిస్తాడు రైతు. దీనిని ఆధారం చేసుకుని ప్రజాకవి వేమన అల్లరి చిల్లరిగా తిరిగే వారిని  రాముడు మంచి బాలుడు అన్నట్టుగా తనను ఉత్తమునిగా పోలుస్తూ అద్భుతమైన వ్యక్తిగా రాణిస్తాడు. మంచి వాడు ఎప్పుడూ కూడా మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది జగమెరిగిన సత్యం. చెడ్డ బాలుడికి మంచి అన్న ఆలోచనే రాదు ఇంక వాడు జీవితంలో మంచి ఏం చేయగలడు పని పాట లేని ఆ కుర్రవాడు చేసే పని రోడ్డుమీద గడపడం, పిల్లల్ని అల్లరి చేయడం ఎవరైనా మంచి బట్టలు కట్టుకొని వెళుతూ ఉంటే దాన్ని పాడు చేయడం ఎదుటి వాళ్ళు ఆనందంగా ఉంటే చూడలేని తనం ఏదో విధంగా వారిని ఇబ్బంది పెట్టాలి అని దాని కోసం అనేకరకాలుగా వారిని  ఇబ్బంది పెడుతూ ఉంటాడు.
తాచెడ్డ కోతి వనమెల్లా చెరిచింది అని పెద్దలు చెప్తారు  ఒక అమ్మాయిని ఇబ్బంది పెడుతున్న కుర్రవాడ్ని  ఎందుకు అలా చేస్తున్నావ్ రోడ్డుమీద తప్పు కదా అంటే  బాగానే వింటాడు ఓహో రోడ్డు మీద చేయకూడదా ఇంట్లో చేయవచ్చునా అన్న హాస్యోక్తు  లతో ఎద్దేవా చేస్తూ మాట్లాడుతాడు. పెద్ద మనిషి గా వచ్చిన వాడు కొంచెం కటువుగా మాట్లాడితే ఆ రౌడీమూక అంతా వచ్చి వీడిని చితకబాదుతారు. అలాంటి దృశ్యాలను చూసిన తర్వాత  ఏ మంచి వాడు ఇలాంటి విషయాలలో తలదూర్చడం మనం చూడగలమా? ఈ బుద్ధిమంతుడు  మంచితనంతో వీరిని మార్చవచ్చు అన్న అభిప్రాయంతో వారితో చేతులు కలుపుతాడు.  మామూలుగా ఉన్నప్పుడు కొన్ని మంచి మాటలు చెప్పినా, వారి చెవికి ఎక్కవు  వీరిని చూసిన వారు అనుకుంటారు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఈ ముఠాలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎందుకూ పనికిరాని వాళ్ళు అల్లరి చిల్లరిగా తిరిగే రౌడీమూక అనే ముద్ర వేస్తారు. మరి రాముడు లాగా ప్రవర్తించిన వాడి పరిస్థితి  వాడు కూడా రౌడీ గానే పరిగణించబడతారు. ఈ విషయాన్ని అందంగా చెప్పాడు వేమన. ఉల్లి పంట వేసిన రైతు చేను పంటకు వచ్చిన తర్వాత ఉల్లిపాయ మొక్కల్ని చూస్తూ వాటిని  పీకుతూ వెళుతూ ఉంటాడు  ఆ మధ్యలో ఉన్న మల్లె మొక్కలు కూడా పీకి పక్కన పెడతాడు తప్ప ఇది చక్కటి సుగంధాన్ని ఇస్తుంది దీన్ని ఇలా బ్రతకనిద్దాం అని మాత్రం ఆలోచించడు ఆ రైతు  అలాంటి స్థితి  మంచి బాలుడికి కూడా. ఆ పద్యాన్ని మీరు కూడా ఒక్కసారి చదవండి

"టక్కరులను గూడి యక్క సక్కెములాడ 
నిక్కమైన ఘనుని నీతి చెడును
ఉల్లితోట బెరగు మల్లె మొక్క కరణి..."


కామెంట్‌లు