ఎవరైనా ఒక యువతి నడుచుకుంటూ వెళుతూ ఉంటే నడక ఎంత అందంగా ఉంది హంస నడిచినట్టుగా ఉంది అని ఆనందిస్తాం. అలాగే ఒక యువతి నాట్యం చేసి మనలను మెప్పిస్తే నట మయూరి అంటూ నెమలి లాగా నాట్యం చేసింది అని ఆనందిస్తాం. అదే కాకి... దాని ఆకారం కానీ, చేష్టలు కానీ ఎవరిని ఆకర్షించలేవు కదా హంసకు అంత పేరు వస్తుంది నాకు పేరు రావడం లేదు అని బాధతో కుమిలిపోయి హంస ఈకలను తొడిగి హంసల మధ్య చేరి నాట్యం చేస్తూ ఉంటే పెట్టుకున్న ఈకలు ఎంత సేపు ఉంటాయి. ఒక్కొక్కటీ ఊడిపోతూ ఉంటే దాని అసలు రూపు బయటపడుతుంది. దానితో హంసలన్నీ దానిని ఛీ కొట్టి దూరంగా తరిమి వేస్తాయి. యవ్వనంలో ఉన్న కుర్రవాడు చేతినిండా డబ్బు కలవాడు కాని పనులు అనేకం చేస్తూ ఉంటాడు. చూడ్డానికి చాలా మంచోడుగా కనిపిస్తారు. ఎవరైనా కొత్త వాడు వస్తే అతను చాలా మంచివాడు అని అతనితో స్నేహం చేసి అతనితో తిరుగుతూ ఉంటే చూసే వ్యక్తులు ఏమనుకుంటారు. ఇతను కూడా వ్యభిచారి, తాగుబోతూ అని అతనిని అగౌరవ పరుస్తూ ఉండరా. ఎవరితోనైనా స్నేహం చేయాలనుకుంటే ముందు అతను మంచివాడా, చెడ్డవాడా అని పరిశీలించిన తర్వాత కానీ స్నేహం చేయకూడదు. వివాహ వ్యవస్థలో కూడా ఏడు తరాల సంప్రదాయాన్ని చూసి కానీ వివాహానికి అంగీకరించరు. కారణం ఏ ఒక్కరికి చెడ్డపేరు ఉన్నా ఆ కుటుంబానికి అదే పేరు వస్తుంది కనుక జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తూ వ్రాశాడు వేమన.
కాకి హంసతో కూడితే;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి