మంచి తన మయినా, చెడ్డ తన మయినా పుట్టుకతోనే వస్తాయి మన పెద్దలు చెబుతూ ఉంటారు. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో గాని పోవని. మంచి చేస్తే మంచి వాడని, చెడు చేస్తే చెడ్డ వాడని జీవితాంతం ఆ పేరు శాశ్వతంగా ఉంటుంది. ఇవి ఎలా ఏర్పడతాయి తల్లిదండ్రుల పెంపకంలో వస్తుందా? పరిసర ప్రాంత ప్రభావం వల్ల అలవడుతుందా? లేదా ఏవైనా ప్రత్యేక సంఘటనలు జరిగినప్పుడు అది వస్తుందా అంటే విశ్లేషించి చెప్పడం కష్టం. భార్య చెడ్డది అని తెలిసిన భర్త ఆమెను హత్యచేసి వివాహమైన వారినందరినీ చంపి చెరసాలలో ఊసలు లెక్కిస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులు మంచి మర్యాదలు కలిగిన వారయితే వారి గుణాలు వస్తాయి వారు ఏ పద్ధతిని ప్రవర్తిస్తే పిల్లలు కూడా అదే సరైన మార్గం అనుకుని దానిని అనుసరిస్తారు. పెరుగుతున్న పిల్లలకు వారి స్నేహితుల ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుంది. దురలవాట్లు ఎక్కువగా ఆ వయసులో స్నేహితుల వల్లే వస్తాయి. తుమ్మ చెట్టును ఉదాహరణగా తీసుకోండి తుమ్మ విత్తనం నాటిన తర్వాత మొలక నుంచే దానికి ముళ్ళు వస్తాయి. అది తుమ్మ చెట్టుకు రక్షణ కావచ్చు కానీ సమాజానికి చెడు చేస్తుంది కదా అది బీజంలోనే ఉంటుంది ప్రత్యేకించి ఎవరో వచ్చి ముల్లును అతికించరు ఆ ముళ్ళు ఎండిన తర్వాత కాల్చేస్తే తప్ప దాని గుణం పోదు అలాగే మనం కుక్కలను చూస్తూ ఉంటాం దాని తోక వంకర గా ఉంటుందని దానిని సరి చేద్దామని చేతితో లాగి పట్టుకుంటాం మనం వదిలిన మరుక్షణం మామూలే ఇక్కడ మూర్ఖుల విషయం ప్రస్తావించడం కోసం దీని గురించి చెబుతారు వేమన కుక్క తోక పుట్టినప్పటి నుంచి ఉన్న వంకర ఎలా పోదో మూర్ఖుడు పుట్టడానికి ముందే వాడికొచ్చిన మూర్ఖత్వం వాడి జీవితాంతం పోదు అని చెప్పడం వేమన తత్వం. ఇది చదివిన తరువాత అయినా వారిలో మార్పు వస్తుందేమో చూద్దాం.
"తుమ్మ చెట్టు ముండ్లు తోడనే పుట్టును
విత్తులోన నుండి వెడలునట్లు మూర్ఖునకును బుద్ధి ముందుగా బుట్టును..."
"తుమ్మ చెట్టు ముండ్లు తోడనే పుట్టును
విత్తులోన నుండి వెడలునట్లు మూర్ఖునకును బుద్ధి ముందుగా బుట్టును..."
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి