కందిపప్పు, పెసరపప్పు లాంటి పప్పు పదార్థాలు ఆరోగ్యానికి మంచిదని వైద్యశాస్త్రం చెబుతోంది. సాధ్యమైనంతవరకు ఆ పదార్థాలను తీసుకోవాలి. ఒక రాజు దగ్గరకి పండితుడు వచ్చి భోజనం దేహి రాజేంద్ర ఘ్రుత సూప సమన్వితం (పప్పు నెయ్యి కలిపిన భోజనం) పెట్టమని అడుగుతాడు. బ్రాహ్మణుడికి భోజనం ఏ కులం వారు తిన్న, ఏ మతం వారు తిన్న ఒకే రకమైన ఆరోగ్యం ఇస్తుంది కదా ఆ పప్పు పదార్థం. ఒట్టి పప్పు తినగలమా? దానిలో ఉప్పు కలపకపోతే రుచి వస్తుందా తినాలనిపిస్తుందా? దానికి ఎంత ఉప్పు కావాలి అన్నది గృహిణికి తెలుసు. అది కలిపి నేతితో తింటే చక్కటి పోషకాహారం అవుతుంది. భోజనంలో పంచభక్ష్య పరమాన్నాలు ఉండాలని ఆయుర్వేదం చెబుతోంది. భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్య పానీయాలు ముద్దపప్పు లేకుండా భోజనం చేస్తే అది భోజనంగా పరిగణించబడదు. దానికి తగినట్లు షడ్రుచులు ఉండాలి. దానిలో ప్రధానం లవణం (ఉప్పు) భోజనం లాగానే జీవితం కూడా హాయిగా కొనసాగాలంటే ఉన్నదానితో తృప్తి పడి జల్సాలకు తావు లేకుండా ఉండాలి. తనకు ఎంత ఆదాయం ఉందో దానిని చూసుకుని ఆ ఇంటి పెద్ద ఖర్చులు చేయాలి తప్ప అది కావాలి ఇది కావాలన్న కోరికలతో అప్పులు చేసి ఉన్న ఆస్తిపాస్తులన్నీ అప్పులుకి అప్పజెప్పితే వారి సంసారం బజారున పడుతుంది. ఆ గ్రామంలో ధనవంతుడు ఎవడు అని లెక్క వేస్తే ఉన్న దానిలో తృప్తిగా హాయిగా కాలం గడుపుతూ ఏ ఒక్కరి దగ్గర చేయి చాచకుండా అప్పు చేయకుండా ఉన్నవాడే అని సమాధానం వస్తుంది.
అప్పు లేని కూడు;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి