సమయ పాలన ముఖ్యమన్న మా శ్రీనివాసుడు;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322

 స్వామి వివేకానంద వారు  ప్రపంచంలో ఎక్కడ గొప్ప సూక్తి ఉన్నా అది భారత దేశము నుంచి అక్కడికి వెళ్ళినది  అని తీర్మానించడం ఆయన ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. భారతదేశం అంటే భరతుడు అనే పేరుతో వచ్చిన దేశము అని అనేక మంది భావిస్తారు కానీ "భ" అంటే వెలుగు  ప్రపంచ దేశాలకు వెలుగు చూపిన దేశం భారతదేశం అని చెప్పినవాడు వివేకానంద. చికాగోలో నేను భారతదేశం నుంచి వచ్చాను  ఈ సభలో నేను రెండు నిమిషాలు మాట్లాడతాను అంటే ఆ అర్హత నీకు లేదు అన్నవారు రెండు మాటలకు అవకాశం ఇస్తే ఆయన ఓపిక ఉన్నంతవరకు చెప్పమని  ప్రేక్షకులంతా హర్షధ్వానాల మధ్య కోరారు. ఇదీ భారతీయుని ఘనత. అలాంటి మహానుభావుడు  శ్రీనివాసరెడ్డికి చాలా బాగా నచ్చిన వ్యక్తి ఆయన తప్ప మరొకడు లేడు. రెడ్డి గారి మనసులో వారి కోసం ఏదో ఒకటి చేయాలన్న అభిప్రాయం ఉంది దాని కోసం ఎంతో ప్రయత్నించారు నాతో కూడా కొన్ని వ్యాసాలు వ్రాయించారు ఆ ఆలోచనకు బీజం వట వృక్షమై కనీసం వారి విగ్రహం అయినా వారి గ్రామంలో పెడితే బాగుంటుంది అన్న ఆలోచన వచ్చింది. కొద్ది కాలం తర్వాత  వారి స్వగ్రామం వెళ్లి అందరినీ పలకరించి, ఆ గ్రామానికి వెళ్లే మొదట మార్గంలో తాను నమ్మిన వివేకానంద స్వామి విగ్రహాన్ని  నిర్మించాలని ఆయన కోరుకున్నారు. అది డబ్బుతో కూడుకున్న పని తను ఆ డబ్బులు ఖర్చు చేయగలను కానీ అక్కడ స్థానికంగా ఒకరిద్దరు ఆ ప్రాంతాన్ని సంరక్షించకపోతే అది పాడుబడిపోతుంది తనకు అంత సమయం లేదు  కొంతమంది పెద్దలను కలిసి  తన మనసులోని అభిప్రాయాన్ని చెపితే  ఒకరిద్దరు  ఆ వ్యవహారం అంతా మేము చూసుకుంటాము  మన గ్రామానికి చేస్తున్న ఈ మంచి పనిలో  మమ్మల్ని కూడా భాగస్వాముల్ని, ఆ విగ్రహ నిర్మాణానికి  ఎంత ఖర్చవుతుందో దానిలో మేము కూడా పంచుకునే ఏర్పాటు చేయి ఆ పైన దీనిని జాగ్రత్తగా మేం చూసుకుంటాం అంటే  మీరు ఎన్నైనా చెప్పండి  మా నాన్న గారి పేరు తో నేను ఒక్కడినే అది చేయదలచుకున్నాను  మీరందరూ కలిస్తే మా నాన్న గారి ఆత్మకు శాంతి ఉండదు  మీరు కాదు కూడదు అంటే  ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసి  వారికి సకల సౌకర్యాలు సమకూరుస్తాను అన్న తర్వాత ఆ పెద్ద మనుషులతా ఒప్పుకున్నారు రెడ్డి గారికి నచ్చిన పద్ధతిలో అందంగా  శిల్పాన్ని తయారు చేయించి  పెద్దలను పిలిచి  ప్రారంభోత్సవం చేసి  అక్కడ  పేదలకు అందరికీ అన్నప్రసాదం  చేశారు. అన్నదానం అంటే రెడ్డి గారికి చాలాకోపం ఇక్కడ భోజనం  స్వామి వారి ప్రసాదంగా ఇవ్వాలి అంతే తప్ప ముష్టి వాడికి పెట్టినట్టుగా పెట్టకూడదు. ఆ శబ్దం వాడకూడదు అన్నది వారి అభిమతం. జీవితంలో ఎంత గొప్ప గురువు దొరకకపోతే  ఇలాంటి అద్భుతమైన అవకాశాలు వచ్చి దానికి తగిన ఆదర్శంగా నిలబడగలిగిన వాడు. కనుక వారి గురువు గారికి పాదాభివందనం చేస్తూ  వివేకానంద స్వామిని స్మరించుకుంటూ అందరికీ వందనాలు అర్పిస్తున్నాను.
కామెంట్‌లు