అమరవీరుల త్యాగఫలం
ధన్య వీరుల పుణ్యఫలం
స్వేచ్ఛ కోసం పోరాడిన స్థలం
మహనీయులు చరిత అనంతం
తెలుసుకో నరుడా ఓ నరుడా!
కులమతాల చిచ్చు వద్దు
బానిసత్వం అసలు వద్దు
పైశాచికత్వం మనకు వద్దు
స్వేచ్చకై పోరాడుదాం ముద్దు
తెలుసుకో నరుడా ఓ నరుడా!
స్వేచ్ఛ లేని భవిత ఎందుకు
కుల మతాల రాక్షసత్వం మనకు ఎందుకు
ఐకమత్యం మనకు బలము
తెల్లదొరలతో పోరాడు చరితము
తెలుసుకో నరుడా ఓ నరుడా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి