ఏది సత్యం
ఏది అసత్యం
తెలుసుకొనుటకు మార్గం
మదన పడుటే గమ్యం..!
ఏది మంచి
ఏది చెడు
తెలుసుకొనుటకు మార్గం
మదన పడుటే గమ్యం..!
ఏది నరకం
ఏది స్వర్గం
తెలుసుకొనుటకు మార్గం
మదన పడుటే గమ్యం..!
ఏది నీతి
ఏది అవినీతి
తెలుసుకొనుటకు మార్గం
మదన పడుటే గమ్యం..!
ఏది కష్టం
ఏది సుఖం
తెలుసుకొనుటకు మార్గం
మదన పడుటే గమ్యం..!
ఏది విశ్వం
ఏది విధ్వంసం
తెలుసుకొనుటకు మార్గం
మదన పడుటే గమ్యం..!
ఏది చింత
ఏది సంతోషం
తెలుసుకొనుటకు మార్గం
మదన పడుటే గమ్యం..!
ఏది శాంతి
ఏది అశాంతి
తెలుసుకొనుటకు మార్గం
మదన పడుటే గమ్యం..!
ఏది దైవం
ఏది దయ్యం
తెలుసుకుంటుకు మార్గం
మదన పడుటే గమ్యం..!
నాది నాది అనకు నీవు
స్వార్థం విడిచి బ్రతుకు నీవు
రమ్యమైనది గమ్యమని నీవు
తెలుసుకోవా కన్నీటి బ్రతుకు..! !
కలము నుండి
జాలు వారిన
కవితలందు
చైతన్య మార్గము
గలది తలచు..! !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి