ఆచార్యశ్రీ జయశంకర్ సార్ జీవిత ప్రస్థానం ;-డా. భరద్వాజరావినూతల 9866203795

 సాహితీబృందావనవేదిక 
ప్రక్రియ-సున్నితం
రూపకర్త -నెల్లుట్ల సునీత 
🦚🦚🦚🦚🦚🦚🦚
4️⃣8️⃣1️⃣)
తెలంగాణా సాధనా యోధుడు
ఆయన ఆర్థికశాస్త్ర పట్టభద్రుడు
ఉద్యమాకాశాన దేదీప్యంగా భాసిల్లాడు
 చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
******** 
4️⃣8️⃣2️⃣)
వృత్తిని దైవంగా భావించాడు
పోరాటమంటే ఉంటాడు‌ముందు
ఎందరికో మార్గదర్శి జయశంకరుడు
 చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
********  
4️⃣8️⃣3️⃣)
ఆచార్యుడిగా చేశారు కాకతీయాన
చిరకాలము స్మరించుకునే యోధుడు
తెలంగాణ వారి ఆరాధ్యదైవం
 చూడచక్కని తెలుగ సున్నితంబు .---!
******** 
4️⃣8️⃣4️⃣)
 వరంగల్ న పుట్టిన విప్లవ కిరణం 
అయ్యాడు పోరాటానికి ఆయుధం
పోరాటపు ఎర్రచుక్క ఆయన
 చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
********  
4️⃣8️⃣5️⃣)
పుట్టింది సామాన్యకుటుంబం
ఎక్కాడుగా ఆచార్య పీఠం
చేపట్టాడు ఎన్నో పదవులు
 చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
కామెంట్‌లు