సాహితీబృందావనవేదిక
ప్రక్రియ-సున్నితం
రూపకర్త -నెల్లుట్ల సునీత
🦚🦚🦚🦚🦚🦚🦚
4️⃣8️⃣6️⃣)
నిండైన తెలుగుదనపు రూపం
చిరునవ్వుతో పలకరించే నైజం
ఆయనకుంది తెలుగన్న మమకారం
చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
********
4️⃣8️⃣7️⃣)
ఆర్థికశాస్త్ర ఆచార్యుడు అతడు
నెల్లూరు జిల్లలో జన్మించాడు
రైతుబిడ్డ ఉప రాష్ట్రపతయ్యాడు
చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
********
4️⃣8️⃣8️⃣)
తెలుగు భాషంటే ప్రాణం
బహుభాషల కిచ్చాడు గౌరవం
మంచితనానికి వేస్తాడు పెద్దపీట
చూడచక్కని తెలుగ సున్నితంబు .---!
********
4️⃣8️⃣9️⃣)
విద్యార్ధి దశలో అయ్యాడునాయకుడు
వాజ్ పాయిగారి అభిమాన శిష్యుడు
విలువలు తెలిసిన జననేత
చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
********
4️⃣9️⃣0️⃣)
పుట్టింది సామాన్యకుటుంబం
ఎదిగాడునిరంతరశ్రమతో
నిలిచిపోయాడు తెలుగోళ్ళ గుండెల్లో
చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
*********
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి