స్వతంత్రభారతం ;-డా. భరద్వాజరావినూతల 9866203795

 సాహితీబృందావనవేదిక 💚 
ప్రక్రియ-సున్నితం
రూపకర్త -నెల్లుట్ల సునీత 
🦚🦚🦚🦚🦚🦚🦚
4️⃣9️⃣1️⃣)
అస్వతంత్రభారతం ఒకనాడు
సంపూర్ణస్వతంత్రభారతం నేడు
ఎందరి త్యాగఫలమో ఇది
 చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
******** 
4️⃣9️⃣2️⃣)
వ్యాపారమంటూ మనదేశం వచ్చారు
అంతర్గతకలహాలు పెట్టారు
కంపెనీలు పెట్డి పాలకులయ్యారు
 చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
********  
4️⃣9️⃣3️⃣)
కులమతాలులేక జనం కదిలారు
ఒక్కటిగా ఒక్కటై నడిచారు
భారతమ్మ విముక్తి కై పోరాడారు
 చూడచక్కని తెలుగ సున్నితంబు .---!
******** 
4️⃣9️⃣4️⃣)
 అహింసామంత్రం చదివాడు‌బాపు
సత్యాగ్రహాలతో నడిపాడు ఉద్యమం
రక్తంచిందించక సాధించాడు స్వతంత్రం
 చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
********  
4️⃣9️⃣5️⃣)
సమైక్యతా ప్రతీక మనజెండా
ఎగిరింది ఎర్రకోటపై నాడు
వజ్రోత్సవ సంబరాలు  నేడు
 చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
*********
కామెంట్‌లు